చైనా భారత్ సరిహద్దులో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న తరుణంలో చైనా సైన్యం తమ పరిధి దాటి లోపలికి రావడం... ఇది తప్పు వెనక్కి వెళ్లాలి అంటూ సూచించిన భారత సైనిక అధికారి పైన దాడి చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే శాంతియుతంగా వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి ఎన్నో చర్చలు జరిగినప్పటికీ చైనా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎప్పుడైతే అజిత్ దోవల్ రంగంలోకి దిగారో  చైనా సైన్యం వెనకడుగు వేయడం మొదలు పెట్టింది. 

 

 అప్పుడు వరకు వెనక్కి తగ్గటానికి  ససేమిరా అన్న చైనా సైన్యం ఒక్కసారిగా అజిత్ ధోవల్ తో చర్చల తర్వాత వెనక్కి తగ్గేందుకు  ఒప్పుకున్నారు. అయితే చైనా సైన్యం సరిహద్దులో వెనుకడుగు వేయడానికి అజిత్ దోవల్ వ్యూహరచనే  కారణం అని ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. వాస్తవంగా అయితే జూలై 5వ తేదీన చైనా పాకిస్తాన్ ఇరాన్ సైన్యాలు భారత దేశంపై యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాయట.. అయితే ఈ విషయాన్ని అటు అమెరికా ఇటు భారత గూఢచార వ్యవస్థ ముందుగానే గ్రహించి సమాచారం అందించడంతో.. కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 

 

 అందుకే అకస్మాత్తుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ లడక్లో పర్యటించడం అక్కడ సైన్య అధికారులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపడం... ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాకు సరిగ్గా బుద్ధి చెప్పాలని సైన్యానికి  అన్ని అధికారాలు ఇవ్వడం లాంటివి జరిగిందట. ఇక ఈ పరిణామాన్ని ఊహించని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆ తర్వాత మోడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ మోదీ ససేమిరా అనడంతో చైనా విదేశాంగ మంత్రి... అజిత్ దోవల్ తో చర్చించాల్సిన పరిస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇక అజిత్ దోవల్ చైనా చేసిన కుట్ర గురించి క్లుప్తంగా సమావేశంలో వివరించడం... చైనా యుద్ధం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది క్లుప్తంగా వివరించడంతో.. చైనా వెనక్కి తగ్గింది అనే చర్చ జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది భవిష్యత్తులో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: