గత మూడు రోజుల నుండి తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా.. ఈరోజు మాత్రం మళ్ళీ భారీగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 1550 పాజిటివ్ కేసులు రాగ కరోనాతో 9మంది మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈకొత్త కేసుల్లో అత్యధికంగా జిహెచ్ఎంసిలో 926, రంగారెడ్డిలో 212 కేసులు నమోదయ్యాయి.
 
వీటి తరువాత అత్యధికంగా కరీంనగర్ లో కేసులు బయటపడ్డాయి. ఈఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 86 కేసులు రావడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక అటు నల్గొండలో కూడా ఈరోజు రికార్డు స్థాయిలో 41 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 36221కరోనా కేసులు నమోదవ్వగా అందులో 23679మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 12178కేసులు యాక్టీవ్ గా వున్నాయి. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 365కు చేరింది. కాగా రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి టెస్టుల సంఖ్య పెరుగగా ఈరోజు ఏకంగా 11525 శాంపిల్ టెస్టులు చేశారు.  
మరోవైపు దేశ వ్యాప్తంగా ఈరోజు కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 6497 కేసులు నమోదుకాగా తమిళనాడులో 4328, కర్ణాటకలో 2738 కేసులు బయటపడ్డాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 900000 దాటగా 23000కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: