కరోనా వైరస్ ప్రభావం వర్షాలు స్టార్ట్ అయ్యాక దేశంలో మరింత పెరిగింది. భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇదే సమయంలో గాలి నుండి కూడా కరోనా సోకె అవకాశం ఉందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించడంతో దేశంలో కరోనా డేంజర్ బెల్స్ తీవ్ర స్థాయిలో మోగుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల కరోనా కట్టడి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పనితీరు చాలా అడ్వాన్స్ గా ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులను అసలు పట్టించుకోవడం లేదని, అసలు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా జరగడం లేదని, కరోనా రోగులకు కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదని విమర్శలు తెలంగాణ సర్కార్ పై వస్తున్నాయి.

 

మహమ్మారి కరోనా విషయంలో కట్టడి చేయడంలో కెసిఆర్ పూర్తిగా ఫెయిల్ అయినట్లే అని అందరూ విమర్శిస్తు రావటం జరిగింది. ప్రతిపక్షాల నుండి మరియు ప్రజల నుండి తీవ్ర స్థాయిలో కరోనా కట్టడి చేయడంలో కేసిఆర్ చేతులెత్తేశారు అని గవర్నర్ కలుగ చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కాపాడాలని, తెలంగాణ వాసులు మొన్నటివరకు ఆర్తనాదాలు చేశారు. ఇలాంటి తరుణంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విని చాలా కాలం తర్వాత కెసిఆర్ కి బూస్ట్ ఇచ్చే విధంగా విమర్శలు చేసిన తెలంగాణ వాసులే  ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే తెలంగాణలో కరోనా కట్టడి చేయడం కోసం కేసీఆర్ సర్కార్ హోమ్ ఐసోలేషన్ ఫార్ములాను వాడుతోంది. ఈ సందర్భంగా కరోనా వైరస్ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి సరైన చికిత్స అందించే విధంగా హోమ్ ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సర్వత్ర ప్రశంశలు వినబడుతున్నాయి. హోమ్ ఐసోలేషన్ కిట్ బాగ్ లో మందులు, మాస్కులు, హ్యాండ్ వాష్ మరియు శానిటైజర్ లు గ్లౌస్ లు అలాగే హోమ్ ఐసోలేషన్ కు సంబంధించి ఇచ్చిన వస్తువులను ఎలా వాడాలి?, రోగి ఏ విధంగా జీవించాలి?, ఇతరులతో ఎలా వ్యవహరించాలి ? అనేవి క్షుణ్ణంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో పుస్తకంలో పొందుపరిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: