జగన్ పదకొండేళ్ళ క్రితం ఏపీ జనాలకే పెద్దగా తెలియడు. ఆయన తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు. ఇక ఎంపీగా ఆయన మూడు నెలల ప్రాయంలో ఉండగానే  తండ్రి దారుణమైన ప్రమాదంలో  మరణించారు. మరి వైఎస్సార్ జనం గుండెల్లో కొలువైన తీరుని కాంగ్రెస్ పెద్దలు కళ్ళారా చూశారు. ఆ తండ్రి కొడుకుగా జగన్ని దగ్గర పెట్టుకుని కాంగ్రెస్ లో కొనసాగిస్తే పోయేది. కానీ అక్కడ ఉన్నది కాంగ్రెస్. అహంకార కాంగ్రెస్

 

అందులే జగన్ తో పని ఏంటి అనుకుంది. ఎవరెవరినో నమ్ముకుంది. ఇపుడు వారంతా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు జగన్ మాత్రం ఏపీకి సీఎం గా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రభ ఇపుడు బాగా వెలిగిపోతోంది. మరి జగన్ని కాదనుకున్నపుడు కాంగ్రెస్ కి అయిదేళ్ళు అధికారం చేతిలో ఉంది. దాంతో పార్టీ పెద్దల్లో  ఆ గర్వం కూడా ఉంది. అది సరేనని అనుకున్నా ఇపుడేమైంది.

 

మరో ఇద్దరు యువ నేతలు కాంగ్రెస్ నుంచి వరసగా  బయటకు వచ్చేస్తున్నారు. వారిలో ఒకరు జ్యోతిరాదిత్య సిందియా. ఆయన మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ని  ఈ మధ్యనే కూలదోశారు. ఆయనకు సీఎం కిరీటం దక్కకుండా కమలనాధ్ కి పట్టం కట్టిన ఫలితం అది. ఇక రెండవ నేత ఇపుడు సచిన్ పైలెట్. ఆయన రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ కొంప ముంచబోతున్నారు.

 


అక్కడ వ్రుద్ధ నేత అశోక్ గెహ్లాట్ ని గద్దె దింపడానికి స్కెచ్ గీస్తున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి మాత్రమే ఇచ్చి ఆయన గ్లామర్ ని మాత్రం వాడుకోవాలనుకున్నారు. దాంతో పైలెట్ ఇపుడు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఆయన రేపో మాపో సొంత పార్టీ పెడతారు అంటున్నారు.

 

ఇవన్నీ ఎందుకంటే కాంగ్రెస్ పన్నెండేళ్లు అయినా కూడా తన రూట్ మార్చుకోలేదు. తన రాత మార్చుకోవడంలేదు. అందుకే యువనేతలు ఆ పార్టీని వీడుతున్నారు. దానికి జగన్ నాంది పలికితే మిగిలిన వారు అనుసరిస్తున్నారు. నాడే జగన్ని దగ్గర పెట్టుకుని ఉంటే కాంగ్రెస్ ఇపుడు బీజేపీ ప్లేస్ లో ఉండేది. మోడీ ప్లేస్ లో రాహుల్ ప్రధానిగా ఉండేవారు. మరి కాంగ్రెస్ పార్టీ కదా మాట వింటుందా.

మరింత సమాచారం తెలుసుకోండి: