ఎల్జి పాలిమర్స్ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖ పట్టణంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్టణం పరమ వాడ ఫార్మాసిటీలో విశాఖ సాల్వెంట్ కంపెనీ లో భారీ స్థాయిలో అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పటికే మంటలు ఆ పరిశ్రమ నుండి భారీగా ఎగసిపడుతున్న తరుణం లో చుట్టుప్రక్కల ఇంకా కంపెనీలు ఉండటంతో స్థానికులలో భయాందోళన నెలకొంది. దాదాపు పదకొండు గంటల సమయంలో ఫార్మా సిటీలో ఈ మంటలు చోటుచేసుకోవడంతో భారీ స్థాయి లో అగ్నిప్రమాదం పెద్ద శబ్దం రావడంతో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో విశాఖలో టెన్షన్ నెలకొంది. భారీగా మంటలు ఎగసి పడుతున్న తరుణంలో ఫైరింజన్లు కూడా దూరంగా నిలిచిపోయాయి.

 

అయితే మంటల్లో కొంతమంది చిక్కుకున్నట్లు స్థానికులు మరియు అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. చాలాసార్లు మంటలు ఆపాలని అగ్నిమాపక బృందం వెళ్లాలని ప్రయత్నించిన మంటల తీవ్రతను తట్టుకోలేక తిరిగి వచ్చేశారు. దీంతో వాటి వేడి తగ్గించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో పలు కంపెనీలు మరి స్థానికులు విపరీతంగా భయపడుతున్నారు. భారీ స్థాయిలో మంటలు ఎగిసి పడుతున్న తరుణంలో పొగ విశాఖ సిటీ ని కమ్మేసింది. ఈ అగ్ని ప్రమాద ఘటన వలన విశాఖ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

 

వస్తున్న వార్తల ప్రకారం మంటల్లో ఎవరు చిక్కుకోలేదని అంటున్నా గాని అనుమానాలు మాత్రం ఇంకా ఉన్నాయి. దట్టమైన పొగలు అదుపులోకి వచ్చాకే అసలు పరిస్థితి ఏంటో అన్నది బయటపడుతుందని అగ్నిమాపక బృందం చెప్పుకొస్తోంది. వరుసగా పరిశ్రమలలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వాలలో మార్పు రావటం లేదని ఈ ఘటన ఉద్దేశించి అక్కడ ఉన్న స్థానికులు విమర్శలు చేస్తున్నారు. జరిగిన ఈ ఘటనలో దాదాపు 20 మంది వీధుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కసారిగా ఘటన జరగటంతో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: