కాపులను బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత టీడీపీ ప్రభుత్వం లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేర్చుతాము అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతో, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు టిడిపి ప్రభుత్వం కాస్త కఠినంగానే వ్యవహరించింది. కానీ కాపులను బీసీల్లో చేర్చే విషయంలో చొరవ తీసుకోవడం వంటి పరిణామాలు ఆ సామాజిక వర్గం లో టిడిపి పై ఆగ్రహం పెరిగేలా చేసింది. అవి గ్రహించే కాపు కార్పొరేషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసినా, ఆ పార్టీని ఆ సామాజిక వర్గం వారు పెద్దగా నమ్మలేదు. ఇక 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టిన జగన్, అదే తూర్పు గోదావరి జిల్లాలో కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే కాపులను బీసీల్లో చేర్చుతానని చెప్పి తాను చంద్రబాబు లా తాను మోసం చేయలేనని, ఇది పూర్తిగా కేంద్రం పరిధిలో అంశమని, తానేమీ చేయలేనని చెప్పేశారు. 


ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం గురించి పెద్దగా ఎవరూ నోరు మెదపలేదు. కొద్ది రోజుల క్రితం కాపు నేస్తం పేరుతో ఏపీ సీఎం జగన్, అర్హులైన కాపు మహిళల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేయడంతో, ఆ క్రెడిట్ ఆయనకు దక్కకుండా చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి, కాపు రిజర్వేషన్ అంశం మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ముద్రగడ కూడా జగన్ కు బహిరంగ లేఖ రాసి, కాపులను బీసీల్లో చేర్చాలని కోరారు. ఇదిలా ఉంటే అకస్మాత్తుగా తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నా అంటూ, ముద్రగడ బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

IHG


 కొంతమంది సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తూ, తనను కాపు ద్రోహిగా, గజదొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమం నడిపించిన కాలంలో, మానసికంగా, శారీరకంగా, రాజకీయంగా ,ఆర్థికంగా ఎంతో నష్టపోయానని, కానీ ఎప్పుడూ బాధ పడలేదు అని, అసలు తాము కాపు ఉద్యమం లోకి రావడానికి చంద్రబాబే కారణమని, కాపులను బీసీల్లో చేర్చుతా  అని అప్పట్లో చెప్పబట్టే, ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉద్యమానికి దిగాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు ఓ మిత్రుడు ఫోన్ చేసి, కాపు క్రెడిట్ వేేరొకరు కొట్టేసే  లా ఉన్నారు అని చెప్పినట్లు గా ముద్రగడ బయటపెట్టారు. దీంతో ఆ క్రెడిట్ కొట్టేయాలని  ప్రయత్నం చేసిందిిి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నా అనే అనుమానాాలు ఇప్పుడు అందరిలోనూ బయలుదేరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: