చంద్రబాబు హయాంలో టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు విధుల నుంచి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో రమణదీక్షితులు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనికి మీడియాని ఆశ్రయించారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా వైయస్ జగన్ ని కూడా కలవడం జరిగింది. వంశపారపర్యంగా శ్రీవారి పాద సేవ చేస్తున్న అర్చకులనూ హఠాత్తుగా చంద్రబాబు ప్రభుత్వం థియేటర్లలో ఇది సరైన నిర్ణయం కాదని రమణదీక్షితులు అప్పట్లో ఖండించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి అవ్వటంతో తిరిగి రమణదీక్షితులకి పదవి వచ్చేలా చేశారు. కాగా వంశపారపర్యంగా చంద్రబాబు ప్రభుత్వం లో 20 మంది అర్చకులు తమ పదవిని కోల్పోయారు.

 

వారిని కూడా చేర్చుకోవాలి అని జగన్ ఆదేశిస్తున్నారు, గాని టీటీడీ బోర్డు లో కొంతమంది చంద్రబాబు మనుషులుగా వ్యవహరిస్తున్నారని వారిని చేర్చుకోవడం లేదని రమణదీక్షితులు మండిపడ్డరు. ఇదే తరుణంలో చంద్రబాబు హయాంలో టీటీడీ కీలక అధికారి స్థానంలో ఎన్నికైన మనిషి బాబుకు అత్యంత సన్నిహితుడు అనే టాక్ ఉంది. అందువల్లనే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో పోస్టులు, నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్క‌క పోగా, బాబు హ‌యాంలో చ‌క్రం తిప్పిన వాళ్ల‌కే మ‌రోసారి పెద్ద పీట వేస్తున్నార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.

 

దీంతో వైయస్ జగన్ వంశపారపర్య అర్చకుల విషయంలో చెప్పిన గాని ఎటువంటి స్పందన అధికారుల నుండి రావడంలేదని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో చంద్రబాబు తొలగించిన వంశపారంపర్య అర్చకులను తిరిగి విధుల్లో చేర్పిస్తామని జగన్ హామీ ఇవ్వటంతో అర్చకులు అంతా ప్రభుత్వం ఈ విషయంలో కలిగా చేసుకోవాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం నుండి ఎన్ని ఒత్తిడులు వస్తున్న టీటీడీ బోర్డు లో కీలకంగా ఉన్న అధికారి లో మార్పు రావడం లేదని సమాచారం. ఇందువల్లనే ఇటీవల సోషల్ మీడియాలో రమణదీక్షితులు సనాతన ధర్మం ప్రభుత్వాల సంకెళ్ళలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని స్వేచ్ఛ రావాలని చంద్రబాబు మనుషులు చేస్తున్న కుట్రలు బట్టి కామెంట్లు చేసినట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: