ఏంటి నిజామా? అలా కూడా పెట్టచ్చ అని ఆశ్చర్యపోతున్నారు కదా! కానీ గుజరాత్ లో అలా చేశారు. అయితే ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే? గతంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా మందుబాబులు అల్లాడిపోయారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఎక్కడ లాక్ డౌన్ విధిస్తారో అనే భయంతో ముందుగానే మద్యాన్ని కొంటున్నారు. 

 

IHG

 

మూడు నెలలకు సరిపడా మద్యాన్ని స్టాక్ కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఎందరో మందుబాబులు మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇంకా ఇలా అక్రమంగా రవాణా చేసేందుకు ఎన్నో రకాల ప్లాన్ లు వేస్తున్నారు. ఇంకా అలానే పెట్రోల్ ట్యాంకులో మద్యం బాటిళ్లు పెట్టారు. 

 

IHG

 

మద్యం తీసుకెళ్లేందుకు నిందితులు ఏకంగా బైకు రూపు రేఖలే మార్చేశారు. పెట్రోల్ ట్యాంకును మద్యం బాటిళ్లు పెట్టేందుకు అనువుగా మార్చేశారు.బైక్ నడిచేందుకు వారు ప్రత్యేకంగా మరో ట్యాంకును తయారు చేశారు. బైకు సీటు కింద సన్నని ట్యూబును ట్యాంకులా మార్చారు. అయితే అది పోలీసులు ఆపి చెక్ చేసినా వారికి మద్యం బాటిళ్లు కనిపించవు.              

 

IHG

 

కానీ పోలీసులు వారి కంటే తెలివిగా ఆలోచించారు. బైకు మొత్తం ఊడపీకి చూడగా మద్యం బాటిళ్లను తీశారు. అనంతరం ఆ మందుబాటిళ్లను బయటకు తీశారు. దీంతో పోలీసులను అరెస్ట్ చేసి సరుకును అంత స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: