ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపారులు అందరూ లబోదిబోమంటున్నారు. అంతకుముందే సంపూర్ణ లాక్‌డౌన్‌ సమయంలో తీవ్రంగా చితికిపోయామని..మళ్లీ లాక్ డౌన్  విధిస్తే తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది అని లబోదిబోమంటున్నారు, ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్లను సంప్రదిస్తూ లాక్‌డౌన్‌ ఎత్తివేయాలంటూ విన్నపాలు చేస్తున్నారు. ఇక వ్యాపారులు ఎన్ని  విన్నపాలు చేసినప్పటికీ కలెక్టర్లు మాత్రం కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య లాక్ డౌన్ ఎత్తివేసే ఛాన్స్ లేదు అంటూ తెగేసి చెబుతున్నారు. తాజాగా ఇక్కడొక  కలెక్టర్ కూడా అదే చెప్పాడు... కలెక్టర్ తో సమావేశమైన వ్యాపారులు లాక్ డౌన్ ఎత్తివేయాలి అంటూ డిమాండ్ చేసారు... లాక్ డౌన్ ఎత్తివేసే ప్రసక్తి లేదని చెబుతూ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు కలెక్టర్.



ఒకరోజు కలెక్టర్ గా ఎవరైనా ఉండాలి అనుకుంటే వెంటనే అవకాశం ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రస్తుతం సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగిస్తున్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కలెక్టర్ కోలా భాస్కర్ తో పలువురు వ్యాపారులు సమావేశమయ్యారు. లాక్‌డౌన్‌ నిబంధనలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ కలెక్టర్ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పోలా భాస్కర్.. ఇదేమీ సినిమా కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగానే తాను ముందుకు వెళ్లాల్సి వస్తుంది అంటూ స్పష్టం చేశారు.



ఈ క్రమంలోనే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు... ఎవరికైనా ఆసక్తి ఉంటే రండి... నాకన్నా బాగా పని చేయగలమని మీరు అనుకుంటే ఒక రోజు కలెక్టర్గా పని చేయడానికి అవకాశం ఇస్తాను... మీరేం చేస్తారో చూద్దాం అంటూ వ్యాపారులకు ఒక ఆఫర్ ఇచ్చాడు కలెక్టర్ పోలా భాస్కర్, కలెక్టర్ మాటలతో ఒక్కసారిగా వ్యాపారులు షాక్ తిన్నారు. ఇక ఈ విషయం బయటకు తెలియడంతో నెటిజన్లు మాకు ఒక్క రోజు అవకాశం ఇవ్వాలంటూ కామెంట్స్  పెడుతున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: