ఆడవాళ్లకు అందం దేవుడిచ్చిన వరం.. కాని కొందరు మాత్రం ఈ అందాన్ని చూసుకుని, ఆకాశంలో మేడలు కడతారు.. తమ స్దాయి మరచి గగనానికి నిచ్చెన వేస్తారు.. చివరికి బంగారు భవిష్యత్తును బండరాయిలా మార్చుకుంటారు.. ఇప్పుడు మనం చదవబోయే ఘటన ఇలాంటిదే.. తనకున్న అందంతో ఆనందంగా పెళ్లి చేసుకుని గడపవలసిన ఓ అమ్మాయి హద్దులేని కోరికలతో, చేతికందని ఆశలతో, సినిమాలో నటించాలన్న వ్యామోహంతో తప్పటడుగు వేసి చివరికి పిచ్చిదానిలా మారింది.. చెన్నైలో జరిగిన ఈ ధీనగాధ గురించి తెలుసుకుంటే..

 

 

చెన్నై సచివాలయ ఉద్యోగులు నివసించే క్వార్టర్స్ దగ్గర ఉన్న పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే మహిళా ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరీ జీపులో గస్తీ తిరుగుతుండగా, రోడ్డుపక్కన ఉన్న కుప్పతొట్టి దగ్గర చింపిరి జుట్టు, పూర్తిగా మాసి, చిరిగిపోయిన చుడీదార్‌లో ఒక అందమైన అమ్మాయి కనిపించింది.. ఆ యువతిని చూసిన ఇన్‌స్పెక్టర్‌ జీపు నుంచి దిగి ఆ యువతి దగ్గరకు వెళ్లి నీవు ఎవరు, ఇక్కడెందుకు ఉన్నావని ప్రశ్నించగా.. ఆ అమ్మాయి మీరు పోలీసా.. నాకు ఆకలి వేస్తోంది.. ఏమైనా కొనిపెడతారా అని అడిగింది.. వెంటనే ఆ యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా, మహిళా కానిస్టేబుళ్లు స్టేషన్‌లోని బాత్‌రూములో  స్నానం చేయించి, డ్రైవర్‌ చేత కొత్త దుస్తులను తెప్పించి తొడిగారు. ఆ తర్వాత కడుపునిండా భోజనం పెట్టిన తరువాత ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి మెల్లగా మాటలు కలుపుతూ, ఆ యువతి వివరాలను సేకరించడం ప్రారంభించింది.

 

 

ఆ విచారణలో యువతి పేరు భారతి అని, ఆమె తండ్రి చెన్నై శాస్త్రీభవన్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారని, కొంత కాలానికి ఈమె తల్లిదండ్రులు మరణించారని తెలిపింది.. ఇదే కాకుండా తన కుటుంబ సభ్యుల వివరాలు కూడా తెలుపగా వారందరిని పిలిపించి విచారించగా వారెవరు ఆమెను తమతో తీసుకెళ్లడానికి సుముఖంగా లేమని తెలిపారు..

 

 

ఈ పరిణామంతో భారతిని అనాథ శరణాలయంలో చేర్చడానికి ప్రయత్నించగా కరోనా కారణంగా కొత్తవారిని చేర్చుకోవడం లేదని వారు నిరాకరించారు. దీంతో చెన్నై కార్పొరేషన్‌ ఆరోగ్య విభాగంలోని తన స్నేహితురాలైన మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మోహనప్రియకు ఫోన్‌ చేసి భారతి దయనీయ పరిస్థితిని వివరించగా అంగీకరించింది. కరోనా పరీక్షలు చేసి ఏదో ఒక శరణాలయానికి పంపుతానని మోహన ప్రియ తెలిపింది. కాగా ఎంతో అందంగా ఉన్న ఈ అమ్మాయి దుర్మార్గుల చేతిలో చిక్కి ఉంటే ఏం జరిగేదో తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు సదరు మహిళా ఎస్సై.. ఇకపోతే పోలీసుల్లో కఠినాత్ములే కాదు జాలి, దయ గలిగిన మానవతా మూర్తులు కూడా ఉంటారని నిరూపించిన ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరిని అభినందించని వారు లేరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: