కరోనాకు మందు లేదు.. ఇంకా వ్యాక్సీన్ రాలేదు.. నిజమే కానీ.. కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే మార్కెట్లోకి అనేక మందులు వచ్చేశాయి. అందులో టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఉన్నాయి. తాజాగా బయోకాన్ కంపెనీ కూడా ఓ ఇంజక్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. దాని పేరు ఇతోలిజుమాబ్‌ 25ఎంజీ/ 5ఎంఎల్‌ . 

 

IHG


కొవిడ్‌- 19 వల్ల ఊపిరి తీసుకోవటంలో తీవ్రంగా ఇబ్బందులు పడే వారికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇతోలిజుమాబ్‌ ఇంజక్షన్‌ ఇచ్చేందుకు బయోకాన్‌కు ఇటీవల డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా..డీసీజీఐ నుంచి పర్మిషన్ వచ్చింది. ఇటువంటి అనుమతి గల ఔషధం ఇదొక్కటేనని బయోకాన్‌  చెబుతోంది. 

 

IHG


ఇంతకీ ఈ ఇంజక్షన్ ధర ఎంతో చెప్పలేదు కదూ..  ఒక్కో ఇంజక్షన్‌ ధర రూ.7,950. దీన్ని రోగికి నాలుగు సార్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే.. నాలుగు ఇంజక్షన్లకు రూ.32,000 ఖర్చు అవుతుందన్నమాట. వాస్తవానికి ఈ ఇతోలిజుమాబ్ ఇంజక్షన్ కొత్తదేమీ కాదు.. ఇప్పటి వరకూ దీన్ని సోరియాసిస్ వ్యాధి కోసం వాడుతున్నారు. 

 


ఇప్పుడు దాన్నే కరోనా చికిత్సకూ వాడుతున్నారు.  ఈ ఏడాది చివరికో లేక వచ్చే ఏడాది ప్రారంభంలోనే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే.. కొవిడ్‌-19 తిరగబెట్టదనే గ్యారెంటీ ఏదీ లేదు. అంతే కాదు.. ఈ వ్యాక్సిన్‌ ప్రభావం ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది... అనేది కూడా చెప్పలేం. అందుకే ఇలాంటి మందులను రెడీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కాస్త ధరలే సామాన్యులకూ అందుబాటులో ఉండే చూస్తే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: