పసుపు.. మన వంటింటి నేస్తం.. పసుపు ఓ మంచి యాంటీ బయోటిక్ అన్న విషయం తెలిసిందే. అందుకే వంటింటి ఆరోగ్య చిట్కాల్లో పసుపు ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎక్కడై తెగినా.. ఏదైనా గాయం అయినా ముందు మనం చేసే పని అక్కడ కాస్త పసుపు రాయడం. అయితే మనం నిత్యం వాడే పసుపులో మరో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం వెలుగు చూసింది. 

 

IHG


పసుపులోని కర్కుమిన్‌ అనే పదార్థం క్యాన్సర్‌ చికిత్సలో అద్భుతంగా ఉపయోగపడుతోందని పరిశోధనల్లో తేలింది. ఈ కర్కుమిన్‌ అనే పదార్థం క్యాన్సర్ కణాలను చంపేస్తుందట. దీని ద్వారా క్యాన్సర్‌ను తగ్గించ వచ్చట. ఈ విషయాన్ని చెన్నైలోని ఐఐటీ శాస్త్రవేత్తలు  కనిపెట్టారు. క్యాన్సర్ చికిత్సలో క్యాన్సర్ కణాలను చంపేందుకు అనేక పద్దతులు అవలంభిస్తారు. 

 

IHG


అలాంటి ఓ ప్రక్రియను అపో ప్టోసిస్‌  అంటారు. ఈ ప్రక్రియలో వాడేందుకు సహజ సిద్ధ పదార్థాల కోసం సైంటిస్టులు అన్వేషిస్తున్న సమయంలో  పసుపులోని కర్కుమిన్ అందుకు అనుకూలంగా ఉందని వారు గుర్తించారు. చెన్నైలోని ఐఐటీ పరిశోధకులు కర్కుమిన్‌పై పరిశీలన చేపట్టారు.ఈ పరిశోధనలో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని వారు వెల్లడించారు. క్యాన్సర్‌ పై పోరాటంలో ఇది ఓ మంచి ముందడుగుగా సైంటిస్టులు చెబుతున్నారు. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: