ప్రస్తుతం చాల మంది ఘుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. మన శరీరంలోని షుగర్, గ్లుక్లోజ్ గా మారకపోవడం వలన షుగర్ వ్యాధి వస్తుంది. వాటిని మనం తీసుకునే ఫుడ్ ద్వారా అదుపులో ఉంచవచ్చు. విత్తనాలు తీసిన ఒక కాకరకాయ తీసుకొని జ్యూస్ తీసి, ప్రతి రోజు ఉదయం తాగితే మంచి ఫలితం ఉంటుంది. కొంచెం గోరువెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ దాచిన చెక్క పొడి వేసి, ప్రతి రోజు ఉదయం తాగుట మంచిది. 

 

 

రోజుకి రెండు ఉసిరికాయలను తినుట ద్వారా షుగర్ వ్యాధిని  అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతి రోజు రాత్రిపూట 10 నుంచి 15 మామిడి ఆకులను నీళ్లలో వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయం ఆ మామిడి ఆకులు తీసెసి, ఆ నీటిని తాగుట మంచిది. ప్రతి రోజు ఉదయం గ్రీన్ టీ తాగుటవలన మంచి ఉపశమనం లభించును. వారానికి ఒకరోజు మునగాకు పప్పు తినుట మంచిది. నిత్య యోగసాధన ద్వారా షుగర్ వ్యాధిని పూర్తిగా నివారించొచ్చు. రోజుకి మూడు నుంచి నాలుగు తులసి ఆకులు తినుట వలన షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం లభించును.

 

 

టమాటాల్లో కేలరీలు తక్కువ. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇవి సరైన ఫుడ్. టమాటాల్ని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. వీటిలో C విటమిన్ ఉంటుంది. ఇవి మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. టమాటాల్లో ఉండే విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది.

 

 

పాలకూరలో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారాన్ని వెంటనే జీర్ణం కానివ్వదు. అందువల్ల ఆహారంలోని షుగర్ మొత్తం వెంటనే రక్తంలో కలవదు. నెమ్మది నెమ్మదిగా... కొద్దికొద్దిగా కలుస్తుంది. అందువల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. బ్రకోలిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ A, C, K ఉంటాయి. అందువల్ల బ్రకోలీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: