ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జిలాల్లో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. కాకినాడలో తిరిగి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతించారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైకి జనాలు వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

 

 

అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇటు ఏలూరు. తాడేపల్లిగూడెంలో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలియజేశారు. అత్యవసర, నిత్యావసర వస్తువులకు మినిహయింపు ఇచ్చారన్నారు. జనాలు ఊరికే రోడ్లపై తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన సమయంలో మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు.

 

 

అయితే అనంతపురంలో కూడా నేటి నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత క‌ఠిన‌త‌రం చేయాల‌ని అధికారులు నిర్ణయించారు. ఉదయం 6 గంట‌ల నుంచి ఉద‌యం 11 గంటల వ‌ర‌కు మాత్ర‌మే జనాలను రోడ్ల‌పైకి అనుమ‌తిస్తారని తెలిపారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చినా.. తిరిగినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావొద్దంటున్నారు. మాస్కు ధరించకపోయినా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి జ‌రిమానాలు విధిస్తారని తెలిపారు.

 

 

అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, మార్కాపురంలలో లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారు. ముందు లాక్‌డౌన్ సడలిస్తారని భావించినా.. మళ్లీ కేసులు పెరగడంతో నిబంధనలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. ప్రజలు సహకరించాలని కోరుతున్నామన్నారు. ఇటు శ్రీకాకుళం జిల్లాలోని పట్టణాల్లో కూడా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళంతో పాటూ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: