గుట్టుచప్పుడు కాకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ పై ఎన్నో పరిశోధనలు ఇప్పటికే జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇలా చేస్తున్న ప్రయోగాల్లో ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు.. ఈ క్రమంలో ఈ వైరస్ శరీరంలో వ్యాపించిన తర్వాత జరిగే మార్పుల నుండి, ఆ రోగి కోలుకున్నాక సంభవించే మార్పుల పై క్షుణంగా అధ్యాయనాలు చేస్తున్నారు.. ఇందులో భాగంగా కరోనా రోగుల రోగ నిరోధక వ్యవస్థలో జరుగుతున్న కీలక మార్పును లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు గుర్తించారట..

 

 

ఇక మన రోగ నిరోధక వ్యవస్థలో యాంటీబాడీలు కీలకం అన్న విషయం తెలిసిందే.. ఇవి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మక్రిములపై పోరాడి రక్షించే సైనిక ప్రోటీన్లు.. ముఖ్యంగా ఇవి కరోనాపై చేసే పోరులో కీలకంగా పని చేస్తున్నాయట. అయితే ఒకసారి కరోనా బారిన పడిన రోగి శరీరంలో వీటి సంఖ్య కొన్ని నెలల్లోనే బాగా తగ్గిపోతున్నట్లు పరిశోధనలో తేలిందట. అంటే కొవిడ్‌-19 వ్యాధికి గురయిన వారు వ్యాధి నిరోధకతను కొద్ది కాలంలోనే కోల్పోతున్నారన్నమాట. ఫలితంగా సాధారణ జలుబులాగానే కొవిడ్‌-19 కూడా మళ్లీ మళ్లీ సోకవచ్చని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వీటి స్దానంలో వైరస్‌కు దీటైన యాంటీబాడీలు ఉత్పత్తువుతున్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ కేటీ డూరెస్‌ వెల్లడించారు..

 

 

ఇకపోతే కరోనాపై పోరాడడానికి వ్యాక్సిన్లను ఆగమేఘాలపై అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఫలితాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇక శరీరంలోని యాంటీబాడీలు మూడు నెలల్లోనే తగ్గిపోతున్నాయంటే, కరోనా వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాక్సిన్‌ ఒక్కసారి వేస్తే సరిపోదు, మళ్లీ మళ్లీ వేయాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్‌ కేటీ డూరెస్‌ చెబుతున్నారు.. ఇకపోతే రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్‌ సోకిన వారిలో ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉండొచ్చు. అదీగాక వారిలో ఉన్న వ్యాధి నిరోధకత శక్తి ఆ వైరస్‌ను గుర్తుంచుకుని ప్రతిదాడి చేస్తుందని మరో నిపుణుడు షాటక్‌ పేర్కొంటున్నారు..

 

 

ఏది ఏమైనా కరోనా దాడినుండి తప్పించుకోవడమే ఇప్పుడు ప్రజల ముందు ఉన్న మార్గం.. ఒకవేళ ఈ వైరస్ బారినపడి కోలుకున్న వారిలో ఇంకా ఎన్ని సైడ్ ఎఫెక్ట్‌లు ముందు ముందు బయటపడతాయో.. మొత్తానికి ఇలాంటి పరిస్దితి మానవ శరీరానికి అంత శ్రేయస్సుకరం కాదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: