ఈ మద్య చైనా కొత్త రకం వస్తువులకే కాదు.. కొత్త రకం వైరస్ లకు కేంద్రంగా మారిందనే చెప్పొచ్చు.  ఇప్పటికే దేశంలో కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఇప్పడు మరికొన్ని కొత్త రకం వైరస్ లు ఇక్కడు ఉన్నాయని స్వయంగా వాళ్లే చెబుతున్నారు. చైనాలో కొత్తరకం ఫ్లూ వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు.. దానికి మహమ్మారిగా మారగల సామర్థ్యం ఉందని హెచ్చరిస్తున్నారు.  ఈ జాతి వైరస్ పందుల్లో వస్తుంది. కానీ అది మనుషులకు కూడా సైలెంట్‌గా వ్యాపించవచ్చని పేర్కొన్నారు. ఈ వైరస్ తన స్వరూపాన్ని మార్చుకోగలదని, ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుందని, మహమ్మారిగా కూడా మారవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

వాస్తవానికి ప్రస్తుతం వెలుగు చూసిన ఈ జీ4 వైరస్ పాతదే. దీనిని చైనా పరిశోధకులే తొలుత గుర్తించారు.   చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్, షాండాంగ్ అగ్రిక‌ల్చ‌రల్ యూనివర్సిటీ, చైనీస్ నేషనల్ ఇన్ ఫ్లుయెంజా సెంటర్ సంయుక్తంగా 2011 నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోకి మరికొన్ని వైరస్ లు వచ్చే ప్రమాదం ఉందని.. మనిషి మనుగడకే అవి ప్రశ్నార్థకంగా మారవొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు.

 

తాజాగా కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి నిజమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది.  కాంగో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సరిహద్దుల్లో కేసులు వెలుగుచూస్తున్నాయని, ఇప్పటి వరకు 48 మంది ఈ వైరస్ బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర నిపుణుడు మైక్ ర్యాన్ తెలిపారు. ఈ నెల మొదటి నుంచే వైరస్ వ్యాప్తి మొదలై చురుగ్గా వ్యాపిస్తోందని, దీని బారినపడి 20 మంది మృతి చెందారని పేర్కొన్నారు. కాగా, ఈ వైరస్ కారణంగా గత రెండేళ్లలో 2,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ వైరస్‌పై దృష్టి సారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: