దేశంలో కరోనా విజృభిస్తున్న విషయం సంగతి అందరికి తెలిసిందే. ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి కొంత వరకు అయినా అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. అయితే కరోనా కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. అయితే వారికి అండగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

 


అయితే రైతులకు ముఖ్యమైన గమనిక. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. కేసీసీ క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకున్న వారికి ఇక 48 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ఎందుకని యోచిస్తున్నారా? తీసుకున్న రుణాన్ని మళ్లీ తిరిగి చెల్లించడానికి. ఈ గడువులోగా బ్యాంక్‌కు డబ్బులు కట్టకపోతే మాత్రం వడ్డీ బాదుడు మొదలవుతుందని నిపుణులు అంటున్నారు.

 

 

అయితే కిసాన్ క్రెడిట్ కార్డు కింద లోన్ తీసుకున్న వారు నిర్ణీత గడువులోగా రుణ మొత్తాన్ని చెల్లిస్తే 4 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ రుణ మొత్తాన్ని చెల్లించకపోతే మాత్రం అధిక వడ్డీ పడుతుంది. 4 శాతం కాకుండా ఏకంగా 7 శాతం వడ్డీ చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణం తీసుకున్న వారికి ఆగస్ట్ 31 వరకు గడువు ఇచ్చింది. ఈలోపు తీసుకున్న రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. అప్పుడు 4 శాతం వడ్డీ పడుతుందన్నారు. లేదంటే 7 శాతం వడ్డీ కట్టాలన్నారు. అందువల్ల రైతులు త్వరపడటం మంచిదని తెలియస్తున్నారు.

 

అయితే సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డు కింద లోన్ తీసుకుంటే మార్చి 31లోపు ఆ లోన్ మొత్తాన్ని కట్టేయాలన్నారు. అయితే ఈసారి కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుందని తెలిపారు. మార్చి 31 గడువును మే 31 వరకు పొడిగించిందన్నారు. తర్వాత ఈ గుడువును మళ్లీ ఆగస్ట్ 31 వరకు ఎక్స్‌టెండ్ చేసిందని నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: