జూలై నెల వస్తున్నా ఇంత వరకూ పాఠశాలలు తెరుచుకోలేదు. ఇప్పట్లో తెరుచుకుంటాయన్న నమ్మకమూ లేదు. ఎప్పుడు బళ్లు తెరుస్తారో తెలియదు.. మరోవైపు ప్రైవేటు స్కూళ్లు ఆన్ లైన్ క్లాసుల పేరుతో హడావిడి చేస్తున్నాయి. కాస్తో కూస్తో ఉన్నవాళ్లతే పర్వా లేదు. కానీ పేదల పిల్లలు ఇబ్బందిపడుతున్నారు. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు కొని పెట్టలేని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

 

ఇప్పుడు అలాంటి వారికి ఊరట కలిగించేలా తెలంగాణ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆన్ లైన్ ద్వారా టీవీలో క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించింది. కరోనా కారణంగా ఇప్పట్లో స్కూళ్లు తెరిచే అవకాశం లేకపోవడంతో అకడమిక్  ఇయర్ నష్టపోకుండా స్కూల్ ఎడ్యుకేషన్  డిపార్ట్ మెంట్ ఈ ఆలోచన చేసింది. పిల్లలు ఇంట్లో ఉండే క్లాసులు వినేలా కార్యాచరణ రూపొందించింది. 

 

IHG

 

ఈనెలలోనే ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రభుత్వ ఆమోదానికి విద్యాశాఖ పెట్టింది. టీవీల ద్వారా విద్యాబోధన అయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణ లోని మెజార్టీ దాదాపు అన్ని ఇళ్లలోనూ టీవీలున్నాయి. అందుకే సర్కారీ చానల్స్ డీడీ యాదగిరి, టీశాట్ లోని రెండు చానళ్ల ద్వారా  హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు చెబుతారు.

 

ప్రతిరోజు ఒక్కో తరగతికి రెండు గంటల చొప్పున మూడు క్లాసులు పెట్టాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఒక్కో సబ్జెక్టు క్లాసు అరగంటపాటు ఉంటుంది. పది నిమిషాలు బ్రేక్ టైమ్ ఇస్తారు. దీనిపై పూర్తి స్థాయి ప్రణాళిక త్వరలోనే వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో టెన్త్  క్లాసు విద్యార్థులకు ఆన్‌ లైన్ క్లాసులు ప్రారంభించారు కూడా. 

మరింత సమాచారం తెలుసుకోండి: