ఈ సృష్టిలో వెలుగులోకి రాని ఎవరికీ తెలియని జీవులు ఎన్నో ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఆ జీవులను చూసినప్పుడు మన కళ్ళను  మనమే నమ్మలేము. ఇక ఆ చేపలు  చేసే పని చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. తాజాగా  ఇక్కడ ఒక చేప ని చూస్తే అలాగే అనిపిస్తుంది. మామూలుగా షార్క్ చేపలు సముద్రంలో ఈదుతూ ఉంటాయి, ఎంతో వేగంగా కదులుతూ ఉంటాయి, అంతేకానీ షార్క్ చేపలు నడవడం ఎప్పుడైనా చూసారా... నాకు తెలిసి దాదాపుగా ఎవరూ చూసుండరు. ఎవరినైనా  ఈ ప్రశ్న అడిగితే చేపలు నడవడం ఏమిటి అది కూడా నీటిలో హాయిగా ఎదుగుతాయి కానీ ఎందుకు నడుస్తాయి అని అంటారు. 

 

 కానీ తాజాగా పరిశోధకులు సముద్రం అడుగున నడిచే కొత్తరకం షార్క్ చేప ను కనుగొన్నారు. మామూలుగా నీళ్లు లేని చోట చేపలు గిలగిలా కొట్టుకుంటు అల్లాడి పోతాయి.. కానీ ఈ షార్క్ చేప  మాత్రం తన కాళ్లతో నడుచుకుంటూ వెళ్ళి నీటి ప్రవాహం ఉన్న దగ్గరికి చేరుతుంది. మొత్తం 4 రకాల జాతుల షార్క్ చేపలు ఇలా ముందుకు నడవగలుగుతాయి  అని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది, ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు కొంతమంది ఉత్తర జలాల్లో కొత్తరకం జీవుల కోసం పరిశోధనలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడ నడుస్తూ వెళ్ళి షార్క్ చేపను  చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఈ షార్క్ చేపలు ఎక్కువ దూరం ప్రయాణించే లేవట. 

 

 కేవలం ఒక మైలు దూరం వరకే ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాల్లోనే తిరుగుతూ జీవిస్తూ ఉంటాయట. ఇక ఈ షార్క్ చేపలు ఈదటం కంటే నడవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాయట. ఇక దీనికి సంబంధించిన వీడియోలు ఆ శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగ  ఈ వీడియో ఎంతగానో అందరిని ఆకర్షిస్తుంది. అయితే ఇలా సృష్టిలో ఆవిర్భవించిన కొత్త జీవులు ఎన్నో ఉంటాయని... ఇలా కొత్తగా నడవడం అలవాటు చేసుకుని భూమిపైకి వచ్చేయడంతోనే వాటికి కాళ్లు చేతులు వచ్చాయి అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ నడిచే చేప ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: