దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. జూలై3న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను అరెస్టు చేయడానికి బిక్రులోని అతను వున్న నివాసానికి పోలీసులు రాగ వారిపై వికాస్ దూబే మరియు అతని గ్యాంగ్ కాల్పులు జరుపడంతో 8మంది పోలీసులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం సరిగ్గా వారం రోజులకు ఈ ఎన్కౌంటర్ ప్రధాన నిందితుడు వికాస్ దూబే ను పోలీసులు ఎన్కౌంటర్ చేసి రివేంజ్ తీర్చుకున్నారు. 
 
ఇక బిక్రులో జరిగిన ఎన్కౌంటర్ గురించి తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు యూపీ లా ఆండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ప్రశాంత్ కుమార్. బిక్రులోని వికాస్ దూబే వున్న ఇంట్లోకి రైడింగ్ చేయడానికి వచ్చిన పోలీసులను ఎన్కౌంటర్ చేసిన తరువాత వారి వద్ద వున్న ఆయుధాలను లాక్కొని వాటిని ఇంట్లో దాచిపెట్టండి అని వికాస్ దూబే.. అతని అనుచరులకు చెప్పాడు.
 
పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పోలీసులను హత మార్చడానికి తుపాకులతో పాటు మరి కొన్ని మారణాయుధాలను వాడారని వెల్లడైయిందని.. సర్కిల్ ఆఫీసర్ దేవంద్ర మిశ్రా కు నాలుగు బుల్లెట్లు తగలగా అన్ని కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్ నుండే షూట్ చేశారని ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.  
 
ఇక ఈదాడిలో మొత్తం 21మంది క్రిమినల్స్ పాల్గొన్నారు అందులో ఇప్పటివరకు 5గురు నిందితులు అరెస్టు కాగా వికాస్ దూబేతో సహా మొత్తం 6గురు వేరు వేరు ఎన్కౌంటర్ లలో మరణించారు. ఎన్కౌంటర్ అనంతరం వికాస్ దూబే ఇంట్లో రైడ్ చేసి పోలీసుల వద్ద నుండి లాక్కొన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ప్రశాంత్ కుమార్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: