ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లోనే రాష్ట్రంలో 43 మంది మృత్యువాత పడ్డారు. ఇదే ఒక్కరోజు హయ్యెస్ట్ మరణాల రికార్డు కావడం విశేషం. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో 43 మంది మృతి చెందారు. అనంతపూర్‌లో 10, పశ్చిమగోదావరి జిల్లాలో 9, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, కడపలో 5, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 408కి చేరింది. 

 


అలాగే గత 24 గంటల్లో కొత్తగా 1916మందికి కరోనా వచ్చినట్టు నిర్థరించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.  ఈ మొత్తం 1916 కొత్త కేసుల్లో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 8కేసులు ఉన్నాయి. మిగిలిన 1908 రాష్ట్రంలోని కేసులే. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 33,019 కేసులు నమోదయ్యాయి.  

 

IHG


కాస్త సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,467కి చేరింది. ఇంకా వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 15,144 మంది చికిత్స పొందుతున్నారు. ఇవే యాక్టివ్ కేసులు అన్నమాట.  

 

IHG


ఏదేమైనా ఒక్కరోజులోనే 43 మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. పక్కన ఉన్న తెలంగాణలో కూడా ఈ రేంజ్‌లో మరణాలు లేవు. ఇప్పుడు ఏపీ మరణాల్లో తెలంగాణను దాటేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: