ప్రపంచంలో ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు పుట్టడం ఎంతో అరుదైన విషయం.  ఇక కవలలు కొంత మంది ఒకే రూపంలో ఉంటుంటారు.. ఇలాంటివి మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం.  ఇలాంటి కవలల్లో కొందరిలో అభిరుచులు సైతం ఒకేలా ఉంటాయి. ఇలాంటి అరుదైన కవలల్లో నోయిడాకు చెందిన మానసి, మాన్య లు ఉన్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వెల్లడి అనంతరం వీరిద్దరూ జాతీయస్థాయిలో ఆసక్తికర అంశంగా మారారు. సోమవారం సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ వెల్లడి కాగా, మానసి, మాన్య ఇద్దరికీ సరిగ్గా 95.8 శాతం మార్కులు వచ్చాయి. ప్రతి సబ్జెక్టులోనూ ఇద్దరికీ మార్కులు సేమ్ టు సేమ్ రావడంతో అందరూ షాక్ తింటున్నారు.

 

ఇది యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ.. దేశం మొత్తం ఈ కవలల గురించిన చర్చలే నడుస్తున్నాయి.  అయితే ఈ కవలలు సైన్స్ గ్రూప్ తీసుకున్నారు. కాగా, ఫిజిక్స్ లో మానసి ఎంతో మెరుగైన విద్యార్థిని కాగా, మాన్య కెమిస్ట్రీలో చురుగ్గా ఉండేది. కానీ ఫైనల్ మార్కులు మాత్రం సమానంగా రావడం విశేషం.  ఈ ఇద్దరు కవలల ఫీలింగ్స్.. రూపు రేఖలు.. గొంతూ అన్నీ ఒకేలా ఉండటం విశేషం.

 

ఇప్పుడు 12వ తరగతిలో టోటల్ మార్కులే కాకుండా ప్రతి సబ్జెక్టులోనూ సమానమైన మార్కులు తెచ్చుకోవడం తల్లిదండ్రులను, బంధుమిత్రులను, స్కూలు టీచర్లను విస్మయానికి గురిచేస్తోంది. కాకపోతే ఈ ఇద్దరి జననం మాత్రం కొద్ది నిమిషాల తేడా అని అంటున్నారు.  దేశంలో ఇలాంటి అరుదైన సంఘటనలు చాలా కొద్ది మంది కవలల్లో మాత్రమే సంబవిస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: