విశాఖ పట్టణంలో పరవాడ ఫార్మాసిటీలో జూలై 13 వ తారీకు రాత్రి 11 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వరుసగా విశాఖపట్టణంలో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటూ ప్రభుత్వాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే నీ దారుణమైన అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో విశాఖ ప్రజలు మండిపడుతున్నారు. ఈ ప్రమాదానికి మండే స్వభావం కలిగిన రసాయనాలను కంపెనీ లో నిల్వ ఉంచడం తోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

IHG

ఇలాంటి తరుణంలో జరిగిన ప్రమాద ఘటన పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో ఫార్మాసిటీలో ఎందుకు ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి అని ప్రశ్నించారు. భద్రత ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు అని సీరియస్ అయ్యారు. మరోపక్క ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా ఈ ఘటనలపై స్పందించడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

IHG

సాల్వెంట్ ఫార్మా కంపెనీలో మండే స్వభావం కలిగిన రసాయనాలు నిల్వచేసే సమయంలో భద్రతా ప్రమాణాలు ఎంత పటిష్టంగా ఉండాలి వంటివి యాజమాన్యాలు పటించుకోవా ?, తగిన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వలనే ఇలాంటి ప్రమాదాలు జరిగేందుకు వీలుంటుందని అన్నారు. కంపెనీలో సరైన రక్షణ ఏర్పాట్లు మరియు భద్రత ప్రమాణాలు పాటించి ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదు అని అసలు ప్రమాదం ఎందుకు జరిగిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: