ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. ఓ మంచి పని చేశారు. తన పత్రికలో పని చేసే వారి జీత భత్యాల్లో కోతలను తగ్గించారు. అసలు కరోనా అంటూ ఒకటి రాగానే అందరికంటే ముందు మేల్కొని ఉద్యోగులను ఇంటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణేనని మీడియా సర్కిళ్లు ఘోషించాయి.  20 శాతం మంది వరకూ ఉద్యోగులను తొలగించాడని.. మరికొందరిని రెండు నెలల వరకూ ఆఫీసుకు రానక్కర్లేదని చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి.  

 


ఆ తర్వాత.. ఉద్యోగాలు ఉన్న వారి కూడా మనశ్శాంతి లేదని.. వారి జీతాల్లో నుంచి 30 శాతం వరకూ వేతనాలు తగ్గించారని టాక్ వచ్చింది. అలాంటి రాధాకృష్ణ ఇప్పుడు కాస్త తన ఉద్యోగులను కరుణించాడు. ఆంధ్రజ్యోతిలో అన్ని పత్రికల కన్నా ముందే కోతలు స్టార్ట్ చేశారు.. మొదట జీతంలో నాలుగోవంతు కోసేశారు. అంటే 25 శాతం అన్నమాట. ఆ తర్వాత ఆ కోత ఇంకాస్త పెంచారట.

 


అంతేనా..  సెలవులు మొత్తం రద్దు చేశారు.. డ్యూటీకి రాకపోతే లాస్ ఆఫ్‌ పే అన్నమాట. అలాంటి రాధాకృష్ణ ఇప్పుడు కాస్త మనసు మార్చుకున్నారట. తన ఉద్యోగులపై కాస్త కరుణ చూపించాడట. ఉద్యోగులకు కాస్త ఊరట కలిగేలా.. జీత భత్యాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చారట. అవేంటంటే.. 20 వేలలోపు జీతం ఉన్నవాళ్లను కోతల నుంచి మినహాయించారట. 

 


ఇక 20 నుంచి 30 వేల జీతం ఉన్నవాళ్ల కోతను 25 నుంచి 10 శాతానికి తగ్గించారట. ఆ తర్వాత  30 వేలకు పైబడి జీతాలున్న వాళ్ల కోతను 25 నుంచి 15 శాతానికి తగ్గించారట. ఇన్నాళ్లూ యాజమాన్యాన్ని తిట్టుకున్న ఉద్యోగులు ఇప్పుడు కాస్త పర్వాలేదులే అనుకుంటున్నారు. ఎంతైనా మా బాసు మంచోడే అంటూ మెచ్చుకుంటున్నారట. ఏం చేస్తాం.. ఉద్యోగం ఉన్నదే ఎక్కువ అన్నట్టుంది పరిస్థితి. ఎవరు మాత్రం ఏం చేస్తారు..? 

మరింత సమాచారం తెలుసుకోండి: