దక్షిణ తెలంగాణ ను ఏడారిగా మార్చే ఏపి ప్రభుత్వం తీసుకవచ్చిన  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 203  జీ వో పై సోమవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేక పోయిందని బీజేపీ  కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమ్మర్శించారు. దీని వెనుక రాజకీయ ఎజెండా గాని..,రహస్య ఎజెండా ఏమైనా ఉందా..? అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు...ఇందుకు సంబంధించి మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.. గత మే 5 న ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీ వో 203 లో మూడు టిఎంసీల నీటిని వాడుకుంటామని చెప్పి ఇప్పుడు 8  టిఎంసీల  వరకు వాడుకుంటామని ట్రిబ్యునల్ కు సోమవారం తెలిపిందన్నారు.

 

ఇదే జరిగితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. .నీళ్లు, నిధులు, నియామకాలు తో..ఎందరో త్యాగధనుల పోరాటం తో తెలంగాణ ను సాధించుకున్నామని తెలిపారు.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయడం లో విఫలమైందని ఆరోపించారు..ఆంధ్రప్రదేశ్  రీ ఆర్గనైజేషన్ చట్టం సెక్షన్ 84 ప్రకారం ఏపి ప్రభుత్వ  జీ వో  చట్టవిరుద్దమని తాను ఈవిషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువచ్చానని తెలిపారు ..ట్రిబ్యునల్ పర్యావరణానికి సంబంధించిన అంశాల కు ప్రాధాన్యత ఇస్తుందన్నారు..దీన్ని సాకుగా చూపించి టెండర్లు పిలువచ్చు..తమదే విజయమంటూ పత్రికలలో వార్తలొచ్చాయి అన్నారు.

 

ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని..లేకపోతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లు నని ఆయన హితవు పలికారు..ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టినపుడు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని ఆయన గుర్తు చేశారు.పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచేలా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను తెలంగాణ ప్రభుత్వం త‌ప్పుబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని తీసుకెళ్లడానికి మాత్రమే తాము ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని … తెలంగాణ నీటిని చుక్క కూడా తీసుకోబోమంటూ కొద్ది రోజుల కింద‌టే ఏపీ సర్కార్ ఎదురుదాడి ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: