వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఏడాది పరిపాలనలో అందరి చేత శభాష్ అనిపించుకునేలా వ్యవహరించాడు. ముఖ్యంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ జగన్ రాణించడంతో దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు జగన్ మొదటి ఏడాది పరిపాలన పర్లేదు అని తమ అభిప్రాయాలను తెలియ చెబుతున్నారు. అంతా బాగానే ఉన్నాగాని వైయస్ జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని విమర్శలు వస్తున్నాయి.

 

చంద్రబాబు పై ఉన్న కోపాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిపై చూపిస్తున్నారని గత కొంత కాలం నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో కమ్మ సామాజిక వర్గానికి తగిన న్యాయం చేయడానికి తన మీద ఉన్న ఆ కమ్మ వ్యతిరేక ముద్ర తొలగించుకోవటానికి జగన్ సరికొత్త స్ట్రాటజీ వేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. అప్పట్లోనే ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు అసెంబ్లీ లో జగన్ భారీ డైలాగులు వేయడం అందరికి తెలిసిందే. నిండు అసెంబ్లీ లో తన చుట్టుపక్కల సహచరులలో ఎక్కువగా ఉండేది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లని మాట్లాడుతూ జగన్  కొడాలి నాని తన సహచరుడు అని చెప్పుకోవటం లో గర్వపడతాను అని చెబుతూనే తన కార్యక్రమాలన్నీ తలశిల రఘురాం చూస్తాడని వీళ్ళంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లం కాదా ? అంటూ అప్పట్లో జగన్ మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే.

 

ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ క్యాబినెట్ లో కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉండటంతో ఈ సారి ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని జగన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టుల్లో కూడా వైయస్ జగన్ కమ్మ సామాజిక వర్గానికి ఇకనుండి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లు పార్టీ లో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: