దేశంలో మార్చి నెల నుంచి మొదలైన కరోనా కేసులు రాను రాను పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే దానికి తగ్గట్టుగా రికవరీ రేటు కూడా బాగానే ఉందని అంటున్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ.  గత 24 గంటల్లో భారత్‌లో 28,498 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 553 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ రాలేదు.. మనం తీసుకునే ఆరోగ్యపరమైన జాగ్రత్తలే శ్రీరామ రక్ష అంటున్నారు వైద్యులు.  దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 9,06,752కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,727కి పెరిగింది. 3,11,565 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,71,460 మంది కోలుకున్నారు. 

 

జూన్ మాసం నుంచి లాక్ డౌన్ సడలించడంతో కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి.  దీంతో కేసులు పెరుగుతున్న నగరాలు, పట్టణాల్లో అక్కడి అధికారులు మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, పూణే అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు.  బీహార్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించడానికి చర్చలు జరుపుతోంది.  ఇప్పటికే పలు చోట్ల లాక్ డౌన్ మళ్లీ మొదలు పెట్టారు.  మరికొన్ని చోట్ల రవాణా వ్యవస్థ విషయంలో కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారికి తప్పకుండా క్వారంటైన్ ఉంచుతున్న విషయం తెలిసిందే.  

 

ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ మద్య పలు జిల్లాల్లో కేసులు పెరిగిపోగా.. జీహెచ్ఎంసీలో పరిధిలో మాత్రం భారీస్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి. దాంతో ఇక్కడ వ్యాపార లావాదేవీలు కూడా సన్నగిల్లాయి. ఈ క్రమంలో వికారాబాద్‌లోని వ్యాపారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్‌లో పది రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తామని ప్రకటించారు. కరోనా కేసులు ఎక్కువ అవుతున్నందున.. పది రోజుల పాటు పట్టణంలోని అన్ని షాపులను మూసివేస్తున్నట్లు వికారాబాద్ పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: