ఏపీలో కరోనా ప్రమద ఘంటికలు మోగిస్తోంది. గత రెండు రోజులుగా కరోనాతో చనిపోతున్న వాళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రోజు వారీ కొత్త కేసులు రెండు వేలకు చేరువలో ఉండడం కలవరపెడుతోంది. ఏపీలో మరో 1916 మంది కరోనా బారిన పడ్డారు.

 

తాజాగా 22 వేల 670 మందికి నిర్వహించిన పరీక్షల్లో 1908 స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 8 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 33 వేల 19కి చేరింది.

 

కొత్త కేసుల్లో 238 చిత్తూరు జిల్లాలో నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో 215 నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో 199, అనంతపురంలో 185, కర్నూలులో 169, నెల్లూరులో 165, తూర్పు గోదావరిలో 160, గంటూరులో 146, విజయనగరంలో 130, కృష్ణాలో 129, కడపలో 112 కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రకాశంలో 32, విశాఖపట్నంలో 28 మంది తాజాగా కరోనా బారిన పడ్డారు.

 

కరోనా కారణంగా ఒక్క రోజే 43 మంది చనిపోయారు. అనంతపూరం జిల్లాలో పది మంది చనిపోగా, పశ్చిమగోదావరి జిల్లాలో 9, చిత్తూరు, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. అలాగే, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోగా, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 408కి చేరింది. 

 

కరోనా నుంచి కోలుకుంటున్న వాళ్ల సంఖ్య ఆశాజనకంగా ఉంది. తాజాగా,  952 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వాళ్ల సంఖ్య 17 వేల 467కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15 వేల 144 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మొత్తానికి కరోనా ఏపీలో విలయతాండవం సృష్టిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: