జగన్ పదేళ్ల పోరాటంతో అధికారంలోకి వచ్చాడు. అలా ఇలా కాకుండా బంపర్ మెజారిటీతో ఆయన అధికారం కైవశం చేసుకున్నాడు. ఏడాదిలోనే అన్ని హామీలు నెరవేర్చాడు. మిగిలిన హామీలు కూడా అమలు చేసే పనిలో బిజీగా ఉన్నాడు. జగన్ ప్రణాళికలు అన్నీ కూడా ఇంకా మొదట్లోనే ఉన్నాయి.

 

అభివ్రుధ్ధి మీద జగన్ ఇంకా ద్రుష్టి పెట్టనే లేదు. ఇంతలో ఎన్నికలు బయల్దేరితే జగన్ సీన్ ఎలా ఉంటుందో మరి. నిజానికి ఏపీలో ఇపుడు ఎన్నికలు జరిగినా జగన్ కే మేలు జరుగుతుంది. అలాంటిది 2022లో జమిలి ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోందన్న టాక్ ఇపుడు జాతీయ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మోడీ ఇమేజ్ నానాటికీ తగ్గుతోంది. కరోనా టైంలోనే మోడీ ఆదరణ బాగా తగ్గినట్లుగా ప్రచారంలో అయితే ఉంది. 

 

అన్ని దేశాలూ తమ పౌరులకు కరోనా టైంలో ఎంతో కొంత నగదు సాయం చేస్తే మోడీ మాత్రం 20 లక్షల కోట్ల పేరిట అతి పెద్ద బాంబు పేల్చి తుస్సుమనిపించారన్న విమర్శలు ఉన్నాయి. ఇక చైనాతో యుధ్ధం విషయంలో కూడా మోడీ సరిగ్గా ఆపరేషన్ చేయలేదన్న మాట ఉంది. ఇపుడు చైనా వెనక్కు తప్పుకున్నట్లుగా చెబుతున్నా ఇది రాజీయే  తప్ప వీరత్వం పోరాటం ఇందులో ఏదీ లేదని కూడా అంటున్నారు.

 

ఈ నేపధ్యంలో షెడ్యూల్  ప్రాతిపదికగా ఎన్నికలు 2024లో జరిగితే మాత్రం మోడీ బీజేపీ ఓడడం ఖాయమని ఇప్పటి నుంచే కమలనాధులు భయపడుతున్నారుట. శాశ్వతంగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉండాలని బీజేపీ ఆలోచనగా ఉంది. అయితే 2024 అయితే మాత్రం కచ్చితంగా  బీజేపీకి భంగపాటు అంటున్నారు. దాంతో రెండేళ్ళు త్యాగం చేసైనా అయిదేళ్ళ అధికారం మళ్ళీ తెచ్చుకోవాలని మోడీ చూస్తున్నారు అంటున్నారు. 

 

మరి మోడీ కనుక ఈ రకమైన ఆలోచన చేస్తే మాత్రం కచ్చితంగా అది జగన్ అధికారానికి కత్తిరింపే అని చెప్పాలి. అయిదేళ్ల పాలన చేస్తేనే సమయం చాలదు, అలాంటిది మూడేళ్ళకు తగ్గి మరీ  ఎన్నికలకు వెళ్ళడం అది కూడా కరోనా వల్ల ఒక ఏడాది కాలం వ్రుధా అయిన వేళ జగన్ ఏ విధంగా ముందస్తు ఎన్నికలను, జమిలి ఎన్నికలను ఫేస్ చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: