చైనా భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైన్యాలు వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. 70 రోజుల వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గతంలోనే చైనా తమ సైన్యం వెనక్కు వెళ్లిపోతున్నట్లు ప్రకటన చేసినా గాల్వన్ లోయ దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. 
 
అయితే తాజాగా చైనా సైన్యం వెనక్కు వెళ్లిపోవడానికి ఆసక్తికరమైన కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ చైనాకు చెక్ పెట్టి ఆ దేశపు సైన్యాన్ని సరిహద్దు నుంచి వెనక్కు మళ్లించింది. గతంలో భారత్ పాక్ సరిహద్దులు కూడా దాటివెళ్లి బాలాకోట్ పై దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను సైతం భారత్ ధ్వంసం చేసింది. భారత్ చైనాకు జులై 5వ తేదీని డెడ్ లైన్ గా విధించి ఆ దేశం సైన్యాన్ని వెనక్కు పంపించినట్లు తెలుస్తోంది. 
 
గతంలో పాకిస్తాన్ అభినందన్ ను విడుదల చేయకపోతే ఆ దేశానికి సంబంధించిన ఓడరేవులను ధ్వంసం చేస్తామని భారత్ ఏ విధంగా ప్రకటన చేసిందో చైనా విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించిందని అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. భారత్ చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తే ఆ దేశం భారీగా నష్టపోయే అవకాశం ఉంది. 
 
ఇప్పటికే టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించడంతో డ్రాగన్ వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. జులై 5వ తేదీలోపు డ్రాగన్ సైన్యం వెనక్కు వెళ్లకపోతే భారత్ బలవంతంగా ఆ దేశ సైన్యాన్ని వెనక్కు పంపుతామని హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. భారత్ చైనాతో యుద్ధానికి సిద్ధమైనా పలు దేశాలు మన దేశానికి సహాయసహకారాలు అందిస్తామని చేసిన ప్రకటనల వల్ల కూడా ఆ దేశం సైన్యం వెనక్కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: