తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో కే‌సి‌ఆర్ సర్కార్ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని కరోనా వైరస్ ని అరికట్టడానికి మాటలు తప్ప చేతల్లో తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని సామాన్యుల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు అదేవిధంగా ప్రజల కోసం పని చేస్తున్న ఫ్రంట్ లైన్ లో ఉన్న పోలీసులకు అదే విధంగా చికిత్స అందిస్తున్న వైద్యులకి కూడా సరైన భద్రత కిట్లు కల్పించలేదని విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా ఆసుపత్రిగా గాంధీ ఆస్పత్రిగా మారినా గాని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు సరైన భద్రత కల్పించడం లేదు అని హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్సులు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు.

 

దాదాపు హాస్పిటల్ లో 800 మంది కరోనా రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఆ హాస్పిటల్ లో నర్సు లతోపాటు కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేసే నర్సులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి చికిత్స అందిస్తున్న గాని కరోనా సోకే పరిస్థితులు ఈమధ్య ఎక్కువైపోయాయి. దీంతో ఇప్పుడు వారు తమ జీవితానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు ఎక్కారు. గత రెండు రోజులుగా గాంధీ ఆసుపత్రి కాంట్రాక్టు నర్సులు సమ్మె చేస్తూ ఉండటంతో కరోనా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నరు. 130 మంది పర్మినెంట్ నర్సులు మాత్రమే కరోనా గాంధీ ఆస్పత్రిలో 800 మంది కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

 

ఇటువంటి తరుణంలో కాంట్రాక్ట్ నర్సులు మాత్రం తమ ప్రాణాలకు భద్రత కల్పించాలి అంటూ తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలనీ, 17 వేల నుండి 35 వేల వరకు జీతాలు పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో మా జీతాలు పెంచకపోతే దేనికి కేసీఆర్ గారు అంటూ ప్రశ్నిస్తున్నారు. కరోనా రోగులకు మా ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రాణాలతో పోరాడుతూ సేవలందిస్తున్న మమ్మల్ని గుర్తించాలి అని మా జీతాల పెంపు విషయంలో రియాక్ట్ అవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: