వరుస పారిశ్రామిక ప్రమాదాలతో విశాఖ శివారు ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టైరీన్ గ్యాస్ లీకై దాదాపు 12 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా 500 మందికిపైగా ఈ ప్రమాదం వల్ల ఆసుపత్రుల పాలయ్యారు. ఆ తర్వాత సాయినార్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది.. ఇందులో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు మళ్లీ పరవాడలోని రాంకీ పరిశ్రమలో భారీ పేలుళ్లు జరిగాయి. 

 


ఈ వరుస ప్రమాదాలు తలచుకుంటే.. విశాఖ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంటోంది. అయితే.. ఈ ప్రమాదాలకూ రాజకీయాలకూ లింక్ ఉందా.. విశాఖ ఏపీకి రాజధాని కాబోతున్నవేళ.. దాన్ని అడ్డుకునేందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల ద్వారా విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ ను చెడగొట్టాలని కుట్ర జరుగుతోందా.. అన్న అనుమానాలను వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. 

 

IHG

 


విశాఖలో జరిగిన వ‌రుస‌ ఘటనల వెనక కుట్ర కోణాలున్నాయేమోనని వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అనుమానం వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ ఘటనపై లింగమనేని బ్రదర్స్‌ మాట్లాడిన తీరు చూస్తే ఏదో కుట్ర ఉందేమో అనుమానం కలుగుతోందన్నారు. 2014లో కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతుల అరటి తోటలను తగులబెట్టి వైయ‌స్సార్‌సీపీపై నెపం వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

IHG


అందుకే విశాఖలో జరిగిన వరుస ప్రమాదాల ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని అమర్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రజలకిచ్చిన మాట ప్రకారం విచారణ జరిపి దోషులను జైలుకు పంపించామని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో ఏ ప్రమాదం జరిగినా దోషులను జైలుకు పంపించారా అని ప్రశ్నించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: