యనమల రామకృష్ణుడు..ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించిన దగ్గర నుండి పార్టీలోనే ఉంటూ మంచి చురుకైన పాత్ర పోషించారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా 1983, 1985, 1989, 1994, 1999, 2004  ఎన్నికల్లో గెలుపొందిన యనమల రామకృష్ణుడు ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిపోయారు. అయితే 2009లో తొలిసారి ఓడిపోయి, 2014 ఎన్నికలకి మాత్రం తుని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పుకుని టిక్కెట్ తన తమ్ముడు యనమల కృష్ణుడికి ఇప్పించారు. కానీ తమ్ముడు తునిలో ఓటమి పాలయ్యారు.

 

కానీ 2014లో ఆది నుండి పార్టీకి కొమ్ము కాస్తూ వస్తున్న యనమల రామకృష్ణుడికి చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. కాకపోతే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి జరిగిన మేలు కంటే కీడే ఎక్కువ. ఆయన వల్ల పార్టీకి ఎంతమేరకు డ్యామేజ్ జరిగిందో 2019 ఎన్నికల్లో తుని ప్రజలు గుద్దిన ఓట్లే చెబుతాయి. యనమల అంటే మొహం కొట్టిన తుని నియోజకవర్గ ప్రజలు 2019లో కూడా యనమల కృష్ణుడిని ఓడించారు.

 

అయితే అప్పుడే తమ్ముడితో పాటు తన కూతురు యనమల దివ్యని కూడా రాజకీయాల్లో దింపి కాకినాడ రూరల్, రాజా నగరం నియోజకవర్గాల్లో పోటీ చేయించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల బరిలో నుండి తప్పించేందుకు నానారకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా చంద్రబాబు ఆ రెండు చోట్లా యనమలకు అవకాశం ఇవ్వలేదు. అటు తునిలో తమ్ముడి ఓటమి ఇటు కూతురికి సీటు దక్కకపోవడంతో యనమల రామకృష్ణుడు రాజకీయంగా కుదేలయ్యాడు. అయినా ఇప్పటికీ కూతురు విషయంలో తన ప్రయత్నాలు విరమించుకోలేదు.  యనమల కుటుంబం వల్ల పార్టీకి పైసా ప్రయోజనం లేకపోగా వారి వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుండటంతో బాబు కూడా యనమల ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

 

భవిష్యత్తులో కూడా తుని తప్ప మరో నియోజకవర్గం మరో నియోజకవర్గంలో యనమల కుటుంబానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వరు. ఒకవేళ కూతురిగా కూడా టిక్కెట్ ఇవ్వాల్సిందే అని యనమల భీష్మించుకుని కూర్చుంటే మాత్రం తుని సీటుని తమ్ముడికి ఇవ్వాలో కుతురికి ఇవ్వాలో తేల్చుకోమని నిర్ణయం యనమలకే వదిలేస్తారు తప్ప ఆరునూరైనా యనమల కుటుంబానికి మరో టికెట్ ఇచ్చే ఉద్దేశ్యం పార్టీ అధిష్టానానికి లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. పరిస్థితులు ఇంత కఠినంగా ఉంటే  అసలు దివ్యకు రాజకీయ యోగం పట్టడం ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరి రాజకీయంలో ఓనమాలు కూడా దిద్దని దివ్య జాతకం ఇలా అయిపోయిందేంటో..

మరింత సమాచారం తెలుసుకోండి: