వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంశం మొదటినుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు... కొన్ని రోజుల వరకు సైలెంట్ గానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఏకంగా అధినేత జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అధినేత జగన్ తప్పు అంటే ఒప్పు అనడం ఒప్పు అంటే తప్పు అనడం లాంటివి వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. ఇటీవలే రఘురామకృష్ణంరాజు అంశం ఆంధ్ర రాజకీయాల్లో వైసీపీలో మరింత రాజుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏకంగా వైసీపీ నుంచి రఘురామ కృష్ణంరాజును షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి కూడా. 

 

 అయితే ఎప్పుడైతే వైసీపీ నుంచి రఘురామ కృష్ణంరాజును కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయో  అప్పటి నుంచి కేంద్రంలో సంప్రదింపులు మొదలుపెట్టిన రఘురామకృష్ణంరాజు హస్తినలో  బిజీబిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఎన్నికలకు ముందు జనసేన పార్టీని జనసేన అధినేత ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన రఘురామకృష్ణంరాజు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జై కొడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే.. ఐదేళ్ల సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా  మారుతుంది అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. 

 

 ఇలా పవన్ పై  పాజిటివ్ గా మాట్లాడి రఘురామకృష్ణరాజు వ్యూహాత్మక స్టెప్పులు వేశారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జనసేన ,బీజేపీ పార్టీలు కలిసి ముందుకు సాగుతున్న తరుణంలో.. రఘురామకృష్ణంరాజు పవన్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఎన్నో రోజుల నుంచి రఘురామ కృష్ణం రాజు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అని టాక్ వినిపిస్తోన్న  నేపథ్యంలో.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరంగా మారిపోయాయి. మరి రఘురామకృష్ణంరాజు ఎత్తుగడ ఫలిస్తుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: