విశాఖ మీద కుట్ర జరుగుతోందా. అమాయకంగా ఉంటూ అందరికీ ఆకట్టుకునే విశాఖ మీద ఎందుకింత ద్వేషం, ఎవరిది ఈ పాపం. విశాఖ వంటి సిటీని ఎవరైనా ప్రేమిస్తారు కానీ ద్వేషించగలరా. మరి కుట్ర ఎందుకు, కుత్రంత్రం ఎందుకు ఇవన్నీ ప్రశ్నలే. మరి సమాధానాలు ఉన్నాయా. ఉన్నా కూడా  దొరుకుతాయా.

 

అంటే ఇపుడే చెప్పడం కష్టం కానీ అనుమానాలు మాత్రం పెరుగుతున్నాయి. విశాఖలో వరసగా ప్రమాదాలు జరుగుతున్నాయంటే వాటి వెనక కచ్చితంగా  ఏదో జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అంటున్నారు. ఇది తనకు వ్యక్తిగతంగా వస్తున్న అనుమానం అని ఆయన బాంబు లాంటి వార్త పేల్చారు.

 

విశాఖలో ఇలా తరచూ ప్రమాదాలు జరగడం, విశాఖకు రాజధాని ఇష్టం లేని వారు చేస్తున్న పనులుగా ఉన్నాయని కూడా ఆయన అంటున్నారు. అంతే కాదు, దీని మీద సమగ్రమైన విచారణ ఒకటి జరిపించాలని ఆయన వైసీపీ సర్కార్ని గట్టిగానే  కోరడం ఇక్కడ విశేషం. 

 

అయితే విశాఖలో ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీస్తే వచ్చిన ప్రయోజనం ఏంటి అన్న ప్రశ్నలు కూడా రావచ్చు. అయితే ఇది రాజకీయం. అందువల్ల ఏదైనా జరగవచ్చు.ఎవరైనా ఏమైనా చేయవచ్చు. ఇది జరగదు అని ఊహించుకోవడం కూడ తప్పే. 

 

అందువల్ల విశాఖలో జరుగుతున్న వరస ప్రమాదాల మీద ఇప్పటికే అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య రచ్చ  సాగుతోంది. అయితే దీనికి మరింత ఆజ్యం పోసేలా సమగ్ర దర్యాప్తునకు గుడివాడ డిమాండ్ చేయడంతో గొడవ కూడా  ముదిరి పాకాన పడుతోందిపుడు. 

 

ఇప్పటికే ఈ విషయంలో టీడీపీ నేతలు వైసీపీ మీద దారుణమైన విమర్శలు చేస్తున్నారు. విశాఖకు శని పట్టించారని కూడా హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇపుడు వారికి ధీటుగా వైసీపీ నేతలు కుట్ర కోణాన్ని బయటకు తీస్తున్నారు. మరి ఇది అతి పెద్ద మాటల యుధ్ధంగా మారుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: