కరోనా వైరస్ అంటే ఇపుడు లోకమంతా భయపడుతోంది. ఎవరో అన్నారు ఏకంగా గ్లోబ్ కి మాస్క్ వేసేసింది కరోనా అని. అంటే మొత్తం భూగోళమంతా కరోనా పదఘట్టనల కింద పడి నలిగిపోతోందని. కరోనా మహమ్మారికి రావడమే తెలుసు. తిరిగి వెళ్ళడం అసలు తెలియదు అని కూడా అంటున్నారు.

 

అసలు ఇదంతా ఎవరు చెబుతున్నారు. అంటే బాధ్యత కలిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మధ్య చాలా చెబుతోంది. ఇలాగే భయపెడుతోంది. కరోనా రోజురోజుకూ తీవ్రమవుతోందని మీడియా ముందుకు వచ్చి హూ పెద్దలు మాట్లాడుతున్నారు. చాలా దేశాలు కరోనా కట్టడి చేయలేకపోతున్నారని, ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని కూడా హూ ఒక్క లెక్కన భయపెడుతోంది.

 

అసలు ఇంతలా భయపెడుతున్న హూ ఇంతకు ముందు చేసిదేంటి. అసలు కరోనా గురించి ప్రపంచాన్ని హెచ్చరించాల్సిన బాధ్యత కలిగిన హూ ఏం చెప్పింది నాడు అన్నది ఒక్కసారి ఆరా తీస్తే షాక్ తింటారు ఎవరైనా, ఎందుకంటే కరోనా మానవుల వల్ల సాటి మానవులకు  సోకదని నాడు ఇదే హూ పెద్దలు మీడియా ముందుకు వచ్చి చల్లగా మాటలు చెప్పారు.

 

పైగా చైనా మాటలకు తందానా అంటూకీలకమైన వేళ  టైం పాస్ చేశారు. కరోనా వైరస్ అన్నది ఒకటి పుట్టిందని, అది చైనాను ఏదో చేస్తోందని వార్తలు వచ్చినపుడు హూ చేయాల్సిన పని చేయకుండా చల్లగా కూర్చుంది. ప్రపంచాన్ని అలెర్ట్ చేయకుండా గమ్మున ఉంది. ఇపుడు మాత్రం భయపెడుతోంది. వణుకు పుట్టేలా మాట్లాడుతోంది.

 

నిజంగా బాధ్యత కలిగిన హూ కి ఇది తగునా అని మేధావుల నుంచి వైద్య రంగ నిపుణులు అంతా అంటున్నారు. హూ ఇప్పటికైనా ప్రపంచానికి ధైర్యం చెప్పాలని, వీలు అయితే వాక్సిన్ విషయంలో కూడా తొందరగా అయ్యేలా దోవ చూపించాలని కోరుకుంటున్నారు. అంతే తప్ప వాక్సిన్ రాదు, కరోనాతో కాపురం అంటూ భయపెడితే కరోనా కంటే ముందే సగం జనాభా చావడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: