తెలంగాణలో కరోనా ఏమాత్రం కంట్రోల్ లోకి రావడం లేదు. మొన్నటి వరకు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టగా నిన్నటి నుండి మళ్ళీ భారీగా పెరిగింది. ఇక ఈరోజు కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 1524కేసులు నమోదుకాగా 10మంది కరోనా తో మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈకొత్త కేసుల్లో అత్యధికంగా జిహెచ్ఎంసిలో 815,రంగారెడ్డిలో 240 కేసులు నమోదయ్యాయి.
 
వీటితోపాటు మిగితా జిల్లాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతూపోతుంది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లిలో నిన్న 6కేసులు రాగ ఈరోజు 12కేసులు బయటపడ్డాయి. ఇక ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 37745కరోనా కేసులు నమోదవ్వగా అందులో 24840మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 12531కేసులు యాక్టీవ్ గా ఉండగా కరోనా మరణాల సంఖ్య 375కు చేరింది. ఈరోజు రికార్డు స్థాయిలో మొత్తం 13175 శాంపిల్ టెస్టులు జరిగాయి. 
మరోవైపు దేశవ్యాప్తంగా ఈఒక్క రోజే రికార్డు స్థాయిలో కరోనా కేసుల సంఖ్య 30000 దాటిందని సమాచారం. దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదుకావడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 930000 దాటగా 23500కు పైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇండియా, బ్రెజిల్ ను దాటేసి ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతుంది. మొదటి స్థానంలో అమెరికా వుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: