కొద్ది రోజులుగా ఏపీ మంత్రివర్గ విస్తరణపైన, కొన్ని ఎమ్మెల్సీ స్థానాలపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రాజ్యసభ సభ్యులుగా ఎంపికయిన ప్రస్తుత మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ త్వరలోనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో వారి స్థానాల్లో ఎవరిని మంత్రులుగా తీసుకుంటారనే  విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరూ, బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని మంత్రులుగా తీసుకుంటారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అంతలోనే మంత్రి పదవులపై కన్నేసిన వారివి కొత్త కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. 

 

IHG


వీరిలో ముఖ్యంగా కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ లకు మంత్రి పదవులు దక్క పోతున్నాయి అంటూ ప్రచారం జరిగింది. కానీ వ్యూహాత్మకంగా జగన్ శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే  సిదిరి అప్పలరాజు పేరు మోపిదేవి వెంకటరమణ స్థానంలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్వతహాగా అప్పలరాజు డాక్టర్ కావడంతో, ఆ విషయంలో ఆయన స్థానికంగా తీసుకుంటున్న చర్యలు జగన్ కు నచ్చడంతో ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ  కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు కావడం కూడా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. 

IHG   IHG 


అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ కు మంత్రి పదవిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ స్థానాన్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేట కు చెందిన పార్టీ వీర విధేయుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడైన మర్రి రాజశేఖర్ కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంకు మరో తొమ్మిది నెలలు మాత్రమే గడువు ఉంది. ఆ స్థానానికి ఎన్నిక జరగదు.

 

IHG

 ఇక గవర్నర్ కోటాలో ఖాళీ కాబోతున్న రెండు స్థానాల్లో కడప జిల్లా రాయచోటి కి చెందిన జకియ సుల్తానా అనే మహిళకు, మరో స్థానాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన  కొయ్యే మోషెన్ రాజుకి కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే లిస్ట్ ఫైనల్ చేసినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: