లోకంలో మానవత్వం అనేది మాట్లాడుకోవడానికి బాగున్నపదం.. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి కఠినమైన నియమంగా మారిపోతుంది.. ఇప్పటికే కరోనా అనే రక్కసి కొరల్లో కాకుల్లా రాలిపోతున్న మనుషుల్లో ఏ మాత్రం అయినా జాలి దయ, భయం కనిపించడం లేదని ప్రస్తుత పరిస్దితుల్లో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు తెలియచేస్తున్నాయి.. ఇక మనిషిగా బ్రతుకుతూ నలుగురిని బ్రతికించేది మానవత్వం.. అయితే, తన బ్రతుకు కోసం నలుగురిని ముంచేది రాక్షసత్వం అంటారు.. ఈ విధానాన్నే సమాజంలో ఎక్కువ మంది అవలంభిస్తున్నారు..

 

 

ఇందుకు ఉదాహరణ ఒక వృద్దురాలిని నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన.. ఆ వివరాలు చూస్తే కొవ్వూరు, ధర్మవరం గ్రామానికి చెందిన కుందుల వసంత రాజ్యలక్ష్మి (70) అనే వృద్దురాలు ఒంటరిగా జీవిస్తుంది.. కాగా ఆమె ఉంటున్న పక్క వాటాలోనే మృతురాలి బావ కుమారుడు అయినా రమేశ్‌బాబు కూడా ఉంటున్నాడట. రాత్రి సమయంలో పడుకునే ముందు ఈమెకు ప్రతి రోజు గీతాపారాయణం చేసే అలవాటు ఉందని ఇతడు తెలిపాడు.. అయితే వృద్ధురాలు సోమవారం రాత్రి హత్య చేయబడటానికి కొన్ని గంటల ముందు గీతాపారాయణం చేసి నిదురించడం తాను చూసానని రమేశ్‌బాబు పేర్కొన్నారు..

 

 

కాగా ఈ రోజు తెల్లవారు జామున అదే గ్రామానికి చెందిన యశోద అనే మహిళ, రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చి ఆ వృద్దురాలిని పిలిచినా పలకలేక పోవడంతో పక్కనే ఉన్న రమేష్‌కు ఈ విషయాన్ని తెలియచేయగా, వారిద్దరు తలుపులు తెరచి ఉన్న ఆ ఇంటిలోకి వెళ్లి చూడగా మంచంపై రాజ్యలక్ష్మి విగత జీవిగా పడి కనిపించింది.. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయగా. కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, రూరల్‌ సీఐ సురేశ్‌, సిబ్బందితో సహా గ్రామానికి చేరుకుని క్లూస్‌ టీమ్‌ను రప్పించి తనిఖీలు చేశారు.

 

 

ఇకపోతే బంగారం కోసం వచ్చిన దొంగలకు అది దొరక్కపోవడంతో వృద్ధురాలి చంపి ఉండవచ్చని మొదట భావించారు. కానీ అక్కడ చోరి చేసిన దాఖాలు కనిపించకపోవడంతో వృద్ధురాలిని దేని కోసం హత్య చేసి ఉంటారనే దానిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: