కరోనా వైరస్.. దేశంలో ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు కొన్ని వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే కొత్త టీవీ కొన్నందుకు కుటుంబసభ్యులందరికి కరోనా వైరస్ సోకినా ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.          

 

టెక్కలి కొడ్రవీధి గ్రామానికి చెందిన దంపతులు టెక్కలి మెయిన్ రోడ్డులోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో వారం రోజుల క్రితం ఎల్ఈడి టీవీ కొన్నారు. అయితే రెండు రోజులకే టీవీ కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ షాపు యజమానితో పాటు ఆయన కుటుంబంలోని ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.  

 

IHG

 

దీంతో ఆ షాపును మూసివేసి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా చేసారు. ఈ విషయం తెలుసుకున్న టీవీ కొనుగోలుదారులు ఒక్కసారిగా అయ్యారు. అయితే ఆ షాపులో గత 14 రోజుల్లో ఎవరైతే కొనుగోలు చేశారో వారందరికి కరోనా నిర్దారణ పరీక్షలు చెయ్యగా టీవీ కొన్న దంపతులతో పాటు వారి కుమార్తె, అల్లుడికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. 

 

ఇది ఇలా ఉంటే.. కరోనా బారిన పడిన దంపతుల కుమార్తె టెక్కలి జిల్లా ఆసుపత్రిలో 'ల్యాబ్ టెక్నీషియన్'గా పనిచేస్తుంది. దీంతో ఆసుపత్రి సిబ్బందిలో టెన్షన్ మొదలైంది. తమ తోటి సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అందరూ కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోగా వారికీ నెగిటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే టీవీ కొనడం కోసం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో ఉన్నారని.. ఆ కొన్ని నిమిషాలకే కరోనా పాజిటివ్ రావడం ఆశ్చర్యకరంగా ఉందని ఆ కుటుంబసభ్యులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: