ఇప్పుడు ప్రపంచమంతా కరోనా భయంతో వణుకుతోంది. ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనా నియంత్రణలో తలమునకలుగా ఉంది.. జనం కూడా ఎప్పుడు ఈ కరోనా నుంచి బయటపడతామా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే కొందరికి పండుగగా మారింది. కరోనా సమయంలో సరకు రవాణాపై అధికారులు పెద్దగా దృష్టి పెట్టే పరిస్థితి లేకపోవడంతో దీన్ని తమ ఆదాయ మార్గంగా మలచుకుంటున్నారు. 

 


ఢిల్లీ నుంచి నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు.. గుజరాత్‌, రాజస్థాన్‌, యూపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి శానిటరీ పరికరాలు, గ్రానైట్‌, మార్బుల్స్‌, ప్లైవుడ్‌ వంటివి వేబిల్లులు లేకుండా తెలంగాణకు  భారీగా అక్రమ రవాణా అవుతున్నాయి. కరోనా సమయంలో తనిఖీలు పెద్దగా లేనందువల్ల సరకు అక్రమ రవాణా జోరుగా సాగిస్తూ పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం సరకు రవాణాపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి సరకులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. 

 

IHG


కరోనా వ్యాప్తి భయంతో వాణిజ్య పన్నులశాఖ అధికారులు తనిఖీలు తగ్గించేశారు. ఇదే అదనుగా  వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వేబిల్లులు తీసుకోకుండా భారీగా జీరో వ్యాపారం చేస్తున్నారు. ఈ దందా వల్ల ఒక్క తెలంగాణలోనే ప్రభుత్వానికి నెలకు రూ.500 కోట్ల మేర పన్ను రాబడి తగ్గిపోయిందట. ఎక్కువగా ఢిల్లీ నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువులు భారీగా తెలంగాణకు వస్తున్నాయట. పన్నులకు వే బిల్లే ఆధారం.. దీని ద్వారానే పన్ను లెక్కలు తేలతాయి. 

 


లాక్‌డౌన్‌ అనంతరం స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, ట్యాబులు, స్మార్ట్ టీవీలకు గిరాకీ పెరిగింది. వీటి అమ్మకాల జోరు పెరిగింది. దీన్ని వ్యాపారులు అవకాశంగా మలచుకున్నారు. మరోవైపు నిర్మాణ రంగం కూడా ఊపందుకుంది. ఈ రంగంలోనూ జీరో వ్యాపారం జరుగుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: