నగర జీవితమంటే ఒక ఒక ఆశ, ఉపాధి దొరుకుతుందనే భరోసా, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయనే అభిప్రాయం. ఇలా ఎన్నో కారణాలతో నగర జీవితం పై జనాలు మోజు పెంచుకున్నారు. మారుమూల పల్లెలు నుంచి వలస వచ్చిన వారు అందరినీ నగరాలు అక్కున చేర్చుకుని ఉపాధి కల్పించేవి. బతుకు బండి కి భరోసా ఇచ్చే వి. కానీ కరోనా వైరస్ విజృంభించిన తర్వాత ఎక్కువగా ఈ నగరాలనే కబళిస్తూ ఉండడంతో, నగరాలు అంటే జనాలకు భయం మొదలైంది. ప్రస్తుత సమయంలో ఉపాధి కూడా పెద్దగా లభించని పరిస్థితి ఉండడంతో, దేశవ్యాప్తంగా నగరాలను జనాలు ఖాళీ చేస్తున్నారు. దేశంలో 89% కరోనా కేసులు 49 నగరాల్లో ఉన్నట్టుగా కేంద్రం లెక్కలు తేల్చింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఈ కేసుల సంఖ్య అదుపు చేయలేని అంత స్థాయికి వెళ్లిపోయాయి.

IHG

 నగర జీవితం అంటే భయం ఆందోళన మొదలవడం వంటి కారణాలతో చాలామంది పల్లెలకు పయనం అవుతున్నారు. పల్లె ను మించిన సేఫ్టీ మరొకటి లేదనే అభిప్రాయానికి వచ్చేసారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తేల్చిన లెక్కల ప్రకారం, దాదాపు 25 లక్షల మంది నగరాన్ని విడిచి వెళ్లిపోయినట్లు గా అంచనా వేశారు. వీరిలో ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారేనని, వారంతా ఇప్పటి వరకు ఉపాధి పొందుతున్న వారేనని, బెంగళూరులో ఇదే పరిస్థితి ఉండడంతో అక్కడ కూడా కేసుల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 15 లక్షల మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.


 తమకు అవకాశం ఉన్న మార్గాల ద్వారా పల్లెలకు పయనం అవుతున్నారు. అయితే ఇలా నగరాలను విడిచి ఉపాధి కూలీలు, ఉద్యోగులు అంతా తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతుండడంతో ఆ ప్రభావం నిర్మాణ రంగాలు, వివిధ పరిశ్రమలపై పడింది. ఇప్పటికే నగరాల్లో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తూ, ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే చాలాకాలమే పట్టేలా కనిపిస్తోంది. ముందు ముందు కరోనా ప్రభావం మరింత తీవ్ర తరం అవుతుంది అనే వార్తలతో ఈ పరిస్థితి వచ్చినట్టుగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: