కరోనా మనదేశానికి ప్రమాదకరంగా మారుతుందా అంటే నిజమే అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే మనదేశ జనాభాకు సరిపడా వైద్య వ్యవస్ద అందుబాటులో లేదని వారంటున్నారు.. కరోనా నేపథ్యంలో, ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్ అంతర్జాతీయంగా వివిధ దేశాల పరిస్థితిని విశ్లేషిస్తూ, భారత్‌లో నెలకొన్న పరిస్థితిపై తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ దేశంలో ప్రతీ 10 వేల జనాభాకు, ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే డాక్టర్లు ఉన్నారని పేర్కొంది.

 

 

అదీగాక భారతదేశంలో మూడు నెలల లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయని, అంతే కాకుండా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాలు అత్యధికంగా కరోనాతో దెబ్బతింటున్నాయని తమ నివేదికలో విన్నవించారు.. ఈ వైరస్ విధ్యంసం ఇంతటితో ఆగిపోదని, ముందు ముందు ఈ వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తిచెందడానికి అవకాశాలు ఉన్నాయని తేల్చిచెప్పింది. భారతదేశంలో ఈ పరిస్దితి నెలకోనడానికి ప్రధాన కారణం లాక్‌డౌన్‌ సమయంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించలేదని ల్యాన్సెట్‌ ఘాటైన విమర్శలు చేసింది.

 

 

ముఖ్యంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాల కల్పన, పునర్నిర్మాణం వైద్య ఆరోగ్యరంగంలో జరగపోవడం వల్ల ఇప్పుడు కరోనాకు అడ్డులేకుండా పోయిందంటున్నారు.. ఇప్పటికైనా పాలకులు మేల్కొని దీనిపై దృష్టిసారించాలని, లేనిపక్షంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే అమెరికా, బ్రెజిల్‌తో పాటు భారతదేశంలోనూ కొన్ని లక్షల కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని ల్యాన్సెట్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇకపోతే పేదల పాలిట ఒక దరిద్రంలా దాపురించిన ఈ కరోనా వల్ల పేదలు మరింత పేదవారిగా మారే అవకాశం ఉందని అంటున్నారు..

 

 

ఇక ఎవరు ఎన్ని చెప్పినా పాలకులకు పట్టిన అవినీతి అనే దైయ్యం వదలనంత వరకు ఈ దేశాన్ని ఎవరు బాగుచేయలేరనేది నిత్య సత్యమనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పుడున్న కరోనా వ్యాధినే కాదు, ఇక ముందు రాబోయే కొత్త కొత్త రోగాలతో ఇంకా ఎన్ని మరణాలు సంభవిస్తాయో తెలియదు.. రాజు మంచి వాడైతే రాజ్యం సుభిక్షంగా వర్దిల్లుతుంది.. అదే రాజు అసమర్ధుడైతే ఆ రాజ్యం అన్నిరకాలుగా అల్లాడుతుంది.. ఇప్పుడు మనదేశంలో, రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్దితులు ఇవే.. అందుకే మారని తలరాత గురించి ఆలోచిస్తూ భయపడటం మానుకుని బ్రతకడం నేర్చుకుంటే సరి అన్ని అవే సర్ధుకు పోతాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: