కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కరోనా వైరస్ భారిన పడకుండా ఉండాలంటే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే కరోనా నుండి తప్పించుకోగలం. కానీ ఎంతోమంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వైరస్ భారిన పడుతున్నారు. 

 

ఇంకా ఒక వ్యక్తి అయితే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సరే.. అదే నిర్లక్ష్యంతో వ్యవహరించాడు. అతనికి తెలుసు.. కరోనా వైరస్ అతనికి మాత్రమే కాదు అతని పక్కన ఉన్నవారికి సోకుతుందని. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఓ క‌రోనా రోగి పాన్ మ‌సాలా కోసం ఆస్ప‌త్రి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

 

ఇంకా ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల ఓ వ్యక్తికి కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడిని స్థానిక ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆ తర్వాత అత‌డిని క‌రోనా‌ రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డుకి త‌ర‌లించారు. 

 

అయితే ఆ వ్యక్తికి పాన్‌ మసాలా తిన‌డం అలవాటు. నిజం చెప్పాలి అంటే పాన్ మాసాలకు బానిస అయ్యాడు. ఇంకా అలాంటి పాన్ మాసాలలు ఐసోలేషన్ సెంట‌ర్ లో అసలు ఉండవు. దీంతో అక్కడ ఉన్న సిబ్బందిని పాన్ మాసాల కోసం అడిగి చూశాడు. కానీ ఉపయోగం లేదు. దీంతో ఇంకా ఉండలేక ఆస్పత్రి నుండి జంప్ అయ్యాయి. 

 

అయితే ఆగ్రాలో లాక్ డౌన్ అమలవ్వడం వల్ల ఎక్క‌డా షాపులు తెరిచిలేవు. దీంతో గాంధీ న‌గ‌ర్ వెళ్లాడు. అక్క‌డ ఓ షాప్ తెరిచి ఉండ‌టంతో పాన్ మ‌సాలా తిని, మ‌రికొన్ని పాన్‌లను పార్శిల్‌ చేయించుకొని అనంత‌రం అక్క‌డి నుంచి త‌న బంధువు ఇంటికి వెళ్లి అతనికి కరోనా వైరస్ సోకినట్టు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించ‌మ‌ని వారిని కోరాడు. 

 

ఇంకా ఈ విషయం తెలుసుకున్న బంధువులు షాక్ కి గురయ్యారు. అంతలోనే అధికారులు అక్క‌డికి చేర‌కుని అత‌డిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అయితే రోగి బంధువును.. అతని కుటుంబ సభ్యులను కూడా కొన్ని రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: