మామూలుగా చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం కామన్... అలాగే  ఇక్కడ అనుమానాస్పదసంగా మృతి చెందిన ఓ వ్యక్తికి పోలీసుల ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు జరిగాయి.. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసు దర్యాప్తు కోసం  అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఫోటోలను  తీసేందుకు ఓ ఫోటోగ్రాఫర్ ని పిలిపించారు. అయితే ఇంకొద్దిసేపట్లో చితికి నిప్పంటిస్తారు  అని అనుకుంటున్న తరుణంలో... చితి మీద పడుకున్న శవం నుండి ఏదో శబ్దం రావటం  మొదలయ్యింది. ఇక చితి కి  అతి దగ్గరగా ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ దీనిని గమనించాడు. దీంతో ఒక్కసారిగా ఫోటోగ్రాఫర్ వెన్నులో వణుకు పుట్టింది. 

 

 ఏంటా శబ్దం అని చూసేసరికి మరికాసేపట్లో అంతిమ సంస్కారాలు జరగబోయే శవం ఊపిరి తీసుకుంటుంది. దీంతో ఈ విషయాన్ని వెంటనే పక్కనే ఉన్న పోలీసులకు తెలిపాడు ఫోటోగ్రాఫర్. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులం జిల్లాలో జరిగింది. ఎర్నా కులం జిల్లాలోని సదాశివన్  అనే వ్యక్తి.. ఇంట్లో అనుమానాస్పదంగా  మరణించడంతో... కేసు దర్యాప్తులో భాగంగా అంతిమ సంస్కారాల ఫోటో తీసేందుకు ఫోటోగ్రాఫర్ టామీ థామస్ ను పోలీసులు పిలిపించారు. ఈ క్రమంలోనే మృతదేహాన్ని ఫోటో తీస్తున్న ఫోటోగ్రాఫర్ టామీ కి  చితి నుండి  ఏదో శబ్దం వినిపించింది. కాస్త భయం భయంగానే వెళ్లి చూసేసరికి శివదాసన్ ఊపిరి తీసుకోవడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 

 

 పోలీసులు వెంటనే అతన్ని  ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తరలించి చికిత్స అందించారు . అయితే అసలు ట్విస్ట్ ఏమిటీ అంటే శివదాసన్ అసలు చనిపోలేదు.  తలకు గాయమై కింద పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అంతే. దీంతో అతను చనిపోయాడని భావించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం  ఇచ్చి  దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే మరి కొన్ని క్షణాల్లో శివదాసాన్  చితికి నిప్పంటిస్తారు  అనుకుంటున్న తరుణంలో అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఫోటోగ్రాఫర్ టామీ  మాట్లాడుతూ ఇలాంటి అనుభవం తన ఫోటోగ్రాఫర్ జీవితంలో మొదటిసారి ఎదురైంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: