భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 9,36,181కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి పెరిగింది. 3,19,840 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,92,032 మంది కోలుకున్నారు.  కరోనా వ్యాప్తిని నిర్మూలించే ప్రయత్నాలు ఎన్ని చేసినా కొంత మంది నిర్లక్ష్య వైఖరి వల్ల కేసులు పెరిగిపోతున్నాయని అధికారులు అంటున్నారు. 

 

రోడ్లపై కొంత మంది మాస్కులు ధరించకుండా.. సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయకుండా ఉండటం వల్ల కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాప్తి నియంత్రణకు రాజస్థాన్ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జోధ్‌పూర్‌లో బుధవారం నుంచి ‘ప్రతి ఇంటిని తట్టండి’ అనే ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  ఈ కార్యక్రమంలో భాగంగా కరోనా భారి పడ్డ ప్రతి ఒక్క ఇంటిని ప్రత్యేకంగా సందర్శిస్తారు.. వారు క్వారంటైన్ లో ఉన్నారా? నిబంధనలు వారు సరిగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలిస్తారు.

 

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు. గత కొన్ని రోజులుగా జోధ్‌పూర్‌లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ‘హర్ ఘర్ దస్తాక్’ అనే కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ బుధవారం ప్రారంభించారు. రాజస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 25 వేలకు చేరగా ఇప్పటి వరకు 525 మంది మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: