తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంబిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా  రోగులకు వైద్యం సరిగ్గా  అందడం లేదు అని పలు వీడియోలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో... తెలంగాణ ప్రజానీకం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దినదినగండంగా బతుకుతున్నారు. కరోనా సోకిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ప్రాణాలు ఉంటాయా ఉండవా అని ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్దామంటే లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారని టాక్  వినిపిస్తున్న నేపథ్యంలో మరింత భయాందోళనకు గురవుతున్నారు. 

 


 అయితే ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో  కరోనా చికిత్స కోసం ఒక రేటును ఫిక్స్ చేసినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా కరోనా  రోగుల నుంచి ఫీజులను వసూలు చేస్తూ జేబులు గుల్ల చేస్తున్నారని ఒక టాక్  ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తోంది. లక్షలకు లక్షలు ఫీజులు  వసూలు చేస్తున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో.. ఇది అందరిలో  మరింత గుబులు పుట్టిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల తోపాటు ప్రైవేటు ఆసుపత్రులను కూడా కరోనా  చికిత్సను అనుమతించిన ప్రభుత్వం తాజాగా... పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కూడా కరోనా  పేషెంట్లకు  ఉచితంగా చికిత్స అందించేందుకు నిర్ణయం తీసుకుంది. 

 

 ఇలా ప్రైవేటు కాలేజీ లో కరోనా  పేషెంట్లు చికిత్సలో భాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీ లను ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మల్లారెడ్డి,మమత,  కామినేని మెడికల్ కాలేజీలలో కరోనా టెస్టుల తో పాటు కరోనా  బారినపడిన రోగులకు చికిత్స కూడా ఉచితంగా అందించేందుకు  ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మంది నిరుపేదలకు మేలు  జరగనుంది అనే చెప్పాలి. కాగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 37, 745 కరోనా  కేసులు ఉండగా... మృతుల సంఖ్య 375 కు చేరింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రికవరీ రేటు 99% గా ఉండటం ప్రస్తుతం అందరిలో మరింత ధైర్యాన్ని నింపుతుంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: