ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనా దేశంలో పుహాన్ లో పురుడు పోసుకుంది. ఈ కరోనా ప్రభావం ఫిబ్రవరి మాసం నుంచి మొదలైనప్పటికీ.. మార్చి నెలలో దీని తీవ్రత ఎక్కువ అయ్యింది.  వివిధ దేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా ప్రబలిపోతుందని అన్నారు.   దేశంలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 9,36,181కు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ బారినపడిన వారిలో 5,92,032 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్‌ వల్ల ఇప్పటి వరకు 24,309 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 29,429 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 582 కరోనా మరణాలు సంభవించాయి.  మార్చి నెల నుంచి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఇంటి పట్టున ఉంటూ కాలం గడిపారు.  

 

ఈ మద్యనే లాక్ డౌన్ సడలించిన తర్వాత ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. అయితే లాక్ డౌన్ కారణంగా  సైబ‌ర్ నేరాలు గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు.  సైబర్ నేరగాళ్ళు అమాయకులను టార్గెట్ చేస్తూ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు లాగేస్తున్నారు. ఈ ఉచ్చులో కాస్తో కూస్తో చదువుకున్న విజ్ఞానవంతులు కూడా డబ్బు ఆశతో సైబర్ నేరగాళ్ళకు అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా మహిళలు, పిల్లల కోసం సురక్షితమైన సైబర్ ప్రపంచాన్ని లక్ష్యంగా చేసుకుని నెల రోజుల పాటు జరిగే ఆన్‌లైన్ ప్రచారం 'సైబ్ హ‌ర్' ను డీజీపీ నేడు ప్రారంభించారు.  

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం టెక్నాలజీని ఎంతగా ఉపయోగిస్తున్నామో.. సైబర్ నేరాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయని అన్నారు.  సైబర్ ప్రమాదాలు, ప్రతికూల చర్యల గురించి ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత అవగాహన కలిగించేలా ప్ర‌చార కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.  తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి యునిసెఫ్ ఇండియా అవసరమైన సహకారాన్ని అందిస్తోందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: