రాజస్థాన్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్రంలో ఉన్న సీఎం మరియు డిప్యూటీ సీఎం ల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోయే అవకాశాలు ఉన్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ మరియు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ల మధ్య ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి విభేదాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సచిన్ పైలెట్ కి 30 మంది ఎమ్మెల్యేలు తోడుకావడంతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా ఉండటంతో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంపై సచిన్ పైలెట్ తిరుగుబాటు చేయటానికి రెడీ అయ్యారు.

 

ముఖ్యంగా సచిన్ పైలెట్ పార్టీలో ప్రభుత్వంలో తనకు సరైన గౌరవం దక్కటం లేదని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మధ్యవర్తిత్వానికి రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి సచిన్ పైలెట్ ఆలోచనలో ఏ మాత్రం మార్పు రావటం లేదని ఆయన పార్టీని వీడి కుదిరితే బీజేపీతో చేతులు కలపాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో  రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం స్టార్ట్ చేసినట్లు సమాచారం. దీంతో బిజెపి పార్టీ పై జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 

ఒకపక్క దేశమంతటా కరోనా వ్యాప్తి చెంది ఉంటే మరోపక్క ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసే పని ప్రారంభించింది అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తమ పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పై తిరుగుబాటు చేసుకునే విధంగా అవకాశం ఇవ్వకూడదు అని, వారికి బీజేపీ తోడైతే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు మేధావులు.

మరింత సమాచారం తెలుసుకోండి: