దేశంలో మార్చి నెల నుంచి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం.  అప్పటి నుంచి మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్స్ మొత్తం బంద్ చేశారు. దాదాపు రెండు నెలలు మద్యం లేక మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  కొంత మంది ఏకంగా మత్తుకోసం శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మరికొంత మంది ఉన్మాదులుగా మారి పిచ్చాసుపత్రి పాలయ్యారు. ఇటీవల లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి మద్యం షాపులు తెరుచుకున్నాయి.. దాంతో మందుబాబులు పండుగ చేసుకున్నారు.

 

అలాంటి మందు బాబులకు మద్యం బాటిళ్లు ఫ్రీగా దొరికితే ఎంత ఆనందం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చెన్నై – తాంబరం రహదారిపై దిండిగల్ సమీపంలో బుధవారం మద్యం తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఓ వైపు గాయాలతో లారీ డ్రైవర్ బాధపడుతుంటే కనీసం అతన్ని పట్టించుకోకుండా మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు జనాలు. సీసాలను ఎగబడి మరీ ఏరుకుంటూ గోనె సంచుల్లో కూడా ఎత్తుకెళ్లారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: